బుధవారం నాడు గుజరాత్ పోలీసులు ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు, ఒక బెంగాలీ మహిళ దగ్గర నకిలీ ఆధార్ కార్డులను కనుగొన్నారు. వడోదరలోని మహిళా రక్షణ కేంద్రం నుండి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించారు. అహ్మదాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో నకిలీ గుర్తింపు పత్రాలతో మహిళలు పట్టుబడ్డారు. మార్చి 11న ముగ్గురు మహిళలు ఓ వ్యక్తితో కలిసి హౌరా నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్నారు. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు వారిని విచారించారు. ఆ నలుగురు వ్యక్తుల వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు నకిలీవని పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని వడోదర రైల్వే పోలీసుల మిస్సింగ్ పర్సన్ సెల్‌కు అప్పగించారు. నిందితులను సర్మిన్ మింటు షేక్ (మౌస్మీ), జన్నత్ జజ్మియా ముస్లిం (యాస్మిన్), ఫర్జానా మహ్మద్ షేక్ (పోపీబేగం), నజ్ముల్ అలీబుద్దీన్‌లుగా గుర్తించారు.
నివేదికల ప్రకారం.. మౌస్మీ పశ్చిమ బెంగాల్ నివాసి కాగా యాస్మిన్, పోపిబేగం బంగ్లాదేశ్‌కు చెందినవారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో నకిలీ ఆధార్ కార్డులు తయారైనట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ‘మామా’ అనే వ్యక్తి తమకు నకిలీ ఆధార్ పత్రాలను అందించినట్లు వారు అంగీకరించారు. మహిళల నుంచి మూడు నకిలీ సిమ్ కార్డులు, ఆరు మొబైల్ ఫోన్లు, నగదు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళలను వడోదరలోని మహిళా రక్షణ కేంద్రానికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు, మహిళలు గోడ దూకి సంస్కరణ గృహం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు మహిళలు గోడ దూకేందుకు ప్లాస్టిక్ డ్రమ్‌ను ఉపయోగించారు. బుధవారం పోలీసులు వారిని అరెస్టు చేసి వెనక్కి తీసుకొచ్చారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ మహిళలను పట్టుకున్నారని, కేసు దర్యాప్తులో ఉందని ధృవీకరించారు. ఈ మహిళలకు జమాతే ముజాహిదీన్-బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు సభ్యుల మధ్య సంబంధాలపై కూడా కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆదివారం భోపాల్‌లోని ఫజర్ అలీ, మహ్మద్ అక్వీల్, జదురుద్దీన్ పఠాన్, ఫజార్ జైనుల్ అబ్దీన్‌లను అదుపులోకి తీసుకుంది. నిందితుల దగ్గర పెద్ద మొత్తంలో జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను కనుగొన్నారు. ATS ప్రకారం, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడానికి జమాత్-ఎ-ముజాహిదీన్-బంగ్లాదేశ్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.