More

    కన్హయ్య లాల్‌ను చంపిన నిందితులను ఢిల్లీకి తరలింపు.. మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌గా పనిచేస్తున్న కన్హయ్య లాల్‌ను హత్య చేసిన ఇద్దరు ప్రధాన నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఢిల్లీకి తీసుకురానుంది. ఈ దారుణ హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టింది. వారిని ఢిల్లీ కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులిద్దరినీ అత్యంత గోప్యంగా దేశ రాజధానికి తీసుకురానున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. గౌస్.. 2014లో కరాచీకి వెళ్లి అక్కడ దావత్-ఎ-ఇస్లామీ సంస్థతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి వారితో టచ్‌లో ఉన్నాడు.

    కన్హయ్య లాల్‌ను నరికి చంపిన తర్వాత నిందితులిద్దరూ ఇస్లాం మతాన్ని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లు వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో నిందితులు.. మా దేవుడిని అగౌరవపరిచిన నిందితులకు గుణపాఠం చెప్పాలనే నా లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేసింది.

    నిందితుల మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపబడ్డాయని అధికారులు తెలిపారు. నిందితులిద్దరి పోస్ట్‌లు, చాట్‌లతో సహా సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలను పొందడానికి NIA బృందం సైబర్, ఫోరెన్సిక్ బృందాల సహాయం తీసుకుంటోంది. దావత్-ఎ-ఇస్లామీకి చెందిన మహ్మద్ రియాజ్ ద్వారా IS కు చెందిన రిమోట్ స్లీపర్ ఆర్గనైజేషన్ అయిన అల్ సుఫాతో వారు కనెక్ట్ అయ్యారని, వారి సంబంధాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ మరో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    spot_img

    Trending Stories

    Related Stories