బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చెలరేగిన టూల్ కిట్ వివాదం…ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మధ్య వార్ గా మారింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బయటపెట్టిన టుల్ కిట్ ను కాంగ్రెస్ ఫోర్జరీ డాక్యుమెంట్లుగా పేర్కొటోంది. సంబిత్ పాత్రతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ కు సైతం కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
అంతటితో ఆగని కాంగ్రెస్ పార్టీ…సంబిత్ పాత్ర ట్విటర్ అకౌంట్ ను బ్యాన్ చేయాలని, టూల్ కిట్ డాక్యుమెంట్లను తొలగించాలని ట్విటర్ మాధ్యమానికి ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించిన ట్వీటర్… సంబిత్ పాత్ర ట్వీట్ చేసిన టూల్ కిట్ కు మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ ను వేసింది.
దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం సంబిత్ పాత్ర ట్విట్ కు లేబుల్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ టూల్ కిట్ పై పోలీసుల విచారణ జరుగుతోందని.., విచారణ పరిధిలో ఉన్న అంశంపై ముందే మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ వేయడం సరికాదని ట్విటర్ కు హితవు పలికింది. ట్విటర్ చర్యలను చూస్తుంటే…, ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ అనుచిత చర్యకు పూనుకున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత కూడా ట్విటర్ ఆ లేబుల్ ను తొలగించలేదు. పైగా దానికి మరికొంతమంది బీజేపీ నేతల ట్వీట్లను సైతం ట్యాగ్ చేసి.. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధినే పరోక్షంగా సవాల్ చేసింది ట్విటర్.!
ట్విటర్ ఇలా దుందుడుకుగా వ్యవహారించడం గతంలోనూ జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మన దేశంలో మోదీ ప్రభుత్వంపై ట్విటర్ వ్యవహారిస్తున్న తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రైతుల పేరుతో ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. ఇంకా అలాగే జరుగుతున్నాయి. ఆ సమయంలో గ్రేటా థన్ బెర్గ్ టూల్ కిట్ వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై NIA కూడా విచారణ జరుపుతోంది. ట్విటర్ వేదికగా భారత దేశ ప్రతిష్ఠ మంటకలిసే విధంగా.. ఖలిస్తాన్ ఉగ్ర మూకల సంస్థలు, అలాగే పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదులు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టారు. దీనిని గుర్తించిన కేంద్ర నిఘా సంస్థలు దాదాపు 1000కి పైగా అనుమానాస్పద హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని ట్విటర్ ను కోరాయి.
అయితే ట్విటర్ మాత్రం అమెరికాలో అయితే ఒకలాగా… , ఇండియాలో అయితే మరోకలాగా అన్నట్లుగా వ్వవహారించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జో బైడన్ మద్దతుదారులు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో ఒక ఉద్యమాన్ని నడిపారు. ఆ సమయంలో అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కూడా చేశారు. ఆ సమయంలో కొద్దిసేపు ట్విటర్ ఈ దాడికి సంబంధించిన సందేశాలను నిలిపివేసింది. కానీ భారత్ వచ్చేసరికి మాత్రం ట్విటర్ తన డబుల్ స్టాండ్స్ ను బయటపెట్టుకుంది.
భావ ప్రకటన స్వేచ్ఛకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ కే లెక్చర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 500 ఖాతాలను అయిష్టాంగానే అది కూడా భారత్ లో మాత్రమే తొలగించింది. అంతేకాదు ఇతర దేశాల్లో ఆ ట్విటర్ అకౌంట్లు యథావిధిగా పనిచేసేందుకు దొడ్డిదారిన అనుమతినిచ్చింది.
విదేశాల్లో తిష్టవేసి భారత్ కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నావారందరూ సామాజిక కార్యకర్తలు అని, జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులగా పేర్కొంది. వారి ట్విటర్ హ్యాండిళ్లను నిలిపివేసేందుకు నిరాకరించింది. అలా చేస్తే భారతీయ చట్టాల ప్రకారం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకున్నట్లేనని ఉల్టా.. కేంద్ర ప్రభుత్వానికే హిత బోధ చేసే ప్రయత్నం చేసింది. అయితే అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతోపాటు.., దానికి లిమిటేషన్స్ సైతం ఉంటాయని, హద్దుమీరితే భారత చట్టాల ప్రకారమే చర్యలు తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనే విషయాన్ని ట్విటర్ కు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ట్విటర్ అనేది భారతీయ సంస్థ కాదు. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక విదేశీ సామాజిక మాధ్యమం. ఈ ట్విటర్ కు మన దేశంలో కోట్లమంది యూజర్లు ఉన్నారు. కోట్లాది మంది భారతీయ యూజర్ల చలువతో ఇది మన దేశంలో వేల కోట్లరూపాయల వ్యాపారం చేస్తోంది.
ఎంత అమెరికా కంపెనీ అయితే మాత్రం భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ట్విటర్ పై ఉంది. ఒక్క ట్విట్టరే కాదు, అమెరికాకు చెందిన ఫేస్ బుక్, లింక్డిన్ వంటి సంస్థలకు సైతం మన దేశంలో కోట్లాది మంది యూజర్లతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయనే విషయం తేలిసిందే.
ట్విట్టర్ వంటి విదేశీ సామాజిక మాద్యమాలు… ఏ దేశంలో యాక్టివ్ గా ఉంటే అక్కడ సామాజిక ఉద్యమాల పేరుతో.., తప్పుడు కథనాలను ప్రసారం చేయడం ద్వారా హింస, దూషణలతో అంశాతిని పురిగొల్పేలా చేయడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి పశ్చిమాసియాలోని అనేక అరబ్ దేశాలే ఉదాహరణగా కొంతమంది విశ్లేషకులు పేర్కొంటారు. ఆయా దేశాల్లో సోషల్ మీడియా ద్వారా జరిగిన విపరీతమైన ప్రచారం ఫలితంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. ప్రభుత్వాలే మారిపోయాయి. దీనికి జాస్మిన్ విప్లవం, అరబ్ వసంతం, అంటూ అమెరికాకు విదేశాంగ విధానంలో భాగంగా పనిచేసే అంతర్జాతీయ మీడియా సంస్థలు, వెబ్ పోర్టల్స్ తెగ ప్రచారం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం జో బైడన్ ప్రభుత్వానికి…భారత్ లోని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఇష్టం లేదని.., అందుకే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజిమ్ ఛేంజ్ అనే ఆపరేషన్ ను యూఎస్ మొదలు పెట్టిందని, దాని విదేశాంగ విధానంపై స్టడీ చేసిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ అధికారంలోకి రావడానికి అక్కడి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ పోషించిన పాత్రను గుర్తుకు తెస్తున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ట్విటర్ ఏకపక్షంగా సస్పెండ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదంతా కూడా జో బైడెన్ ను ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేసే ప్రచారంలో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.
అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న తరుణంలో జో బైడన్ కుమారుడు హంటర్ బైడన్ అవినీతికి సంబధించిన కథనాలు బయటకు వచ్చాయి. అయితే ట్విటర్, ఫేస్ బుక్ , వంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఈ విషయాలేవి వెలుగులోకి రాకుండా శాయశక్తుల ప్రయత్నించాయనే ఆరోపణలు ఉన్నాయి.
దేశాల వారిగా సామాజిక మాధ్యమం ముసుగులో ట్వీటర్ జరుపుతున్న కార్యకలాపాలు చూసిన తర్వాత.., అమెరికాలోని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే ఒక టూల్ గా ట్వీటర్ పనిచేస్తోందనే విషయం రూడీ అవుతోంది.
అమెరికన్ ఫార్మా కంపెనీలు కరోనా మహమ్మారిని ఆసరాగా చేసుకుని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో మందులు, మాస్కులు, ఆక్సిజన్ పరికరాలు, టీకాలు ఇలా అన్నింటిని మార్కెటింగ్ చేసుకునేందుకు ప్లాన్ చేశాయనే ప్రచారం ఉంది. అయితే ఆఫ్రికన్ కంట్రీస్ అమెరికన్ టీకాలను కోనుగోలు చేసే ఆర్థిక శక్తి లేకపోవడం, అలాగే ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనా తన దేశంలోకి విదేశీ కంపెనీలను అంతా ఈజీగా రానివ్వకపోవడంతో, అమెరికన్ కంపెనీలు భారత్ పైనే ఆశలు పెట్టుకున్నాయని చెబుతున్నారు.
భారత దేశమంటే..130 కోట్ల మంది జనాభా. అందులోనూ ఫర్చేజింగ్ పవర్ కలిగిన మిడిల్ క్లాస్ జనం కోట్ల సంఖ్యలో ఉన్న దేశం. ఒక్క భారత్ లోనే ట్రిలియన్ డాలర్ల మెడికల్ ఎక్యూప్ మెంట్, మెడిసిన్ , వ్యాక్సినేషన్, బిజినెస్ కోసం అమెరికన్ మల్టినేషన్ కంపెనీలు వేసిన ప్లాన్స్ ను…భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ పేరుతో వమ్ము చేశాడు.
ఒక్కసారి దిగుమతి చేసుకున్న ప్రతిది తిరిగి ఇండియాలోనే ఉత్పత్తి జరగాలనే సూత్రాన్ని అమలు చేయడం జరిగింది. పీపీఈ కిట్ లు, మాస్కులు దిగుమతి చేసుకున్న భారత దేశం…జస్ట్ మూడు నెలల్లో అవే దేశాలకు అంతకంటే మంచి క్వాలిటీతో కొవిడ్ చికిత్సకు సంబంధించిన ఎక్విప్ మెంట్ ను ఎగుమతి చేయగలిగింది. ఆఖరికి 11 నెలల్లోనే దేశీయంగా రెండు కరోనా వ్యాక్సిన్లు సైతం అగ్రదేశాలకు దీటుగా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. అమెరికన్ కంపెనీల మాదిరిగా వ్యాపార ధోరణిలో కాకుండా.., మైత్రి ఒప్పందంలో భాగంగా మూడో ప్రపంచ దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందించడం జరిగింది.
ఈ కారణాలతోనే అమెరికన్ కంపెనీలు… సీరం కంపెనీ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అవసరమైన మూడి సరుకు ఎగుమతులపై జై బైడన్ అధికారంలోకి రాగానే ఆంక్షలు విధించేలా చేశాయి. దీంతో సీరం కంపెనీ బ్రిటన్ నుంచి తన కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. వ్యాక్సిన్లకు అవసరమైన ముడి సరుకు ఎగుమతులపై ఆంక్షలు వెనుక అమెరికన్ మందుల కంపెనీల ప్రయోజనాలతోపాటు భారత్ లో ప్రధాని మోదీని ఇబ్బందుల పాలుచేయాలనే వ్యూహాం ఉందన్నది కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం.!
నిజానికి మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగా నమోదు అయ్యాయి. ఇవి రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావు. కరోనా కారణంగా ఎక్కువ మరణాలు సంభవించింది కూడా మహారాష్ట్రలోనే.! అయినా అంతర్జాతీయ మీడియా సంస్థలు, నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియా చానళ్లు, పత్రికలు అన్ని కూడా పీఎం మోదీ విఫలం అయ్యాడు అనే విధంగా వరుస కథనాలు ప్రసారం చేశాయి. ఇంకా కూడా చేస్తునే ఉన్నాయి.
ప్రధాని మోదీపై జరుగుతున్న ఈ విష ప్రచారానికి లీడ్ రోల్ పోషిస్తున్న సామాజిక మాద్యమం ట్విటర్.! అదే విధంగా బీజేపీ పై బయటపెట్టిన టూల్ కిట్ డ్యాక్సుమెంట్లను కాంగ్రెస్ ఫేక్ అని పైకి చెబుతున్నప్పటికీ, అవి తమ అంతర్గత రీసెర్చ్ డాక్యుమెంట్లు అని.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజీవ్ గౌడ పరోక్షంగా అంగీకరించాడు. వీటిని సౌమ్య వర్మ రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
బీజేపీ…సౌమ్య పేరును బహిర్గతం చేసిన తర్వాత ఆమె ట్వీటర్ తోపాటు మిగిలిన సోషల్ మీడియా సైట్ల నుంచి తన ప్రొఫెల్ పిక్ తోపాటు చిరునామాను ఎందుకు డిలీట చేసింది.? అంతేకాదు పోలీసులు విచారణ జరుపుతున్న అంశంపై ట్విటర్ ముందే మానిప్యులేటెడ్ మీడియా అంటూ ఎలా నిర్ణయానికి వచ్చింది? భారత చట్టాలు అంటే ట్వటర్ కు గౌరవం లేదా.? ట్విటర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకుని వస్తోంది.?