More

  కాళీ మాత చేతిలో సిగరేట్..! పోస్ట్ తొలగించిన ట్విట్టర్.. సారీ చెప్పిన మ్యూజియం..!!

  మలయాళీ దర్శకురాలు లీనా మణిమేగలై విడుదల చేసిన కాళీ పోస్టర్ దేశం వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యింది. దేవతా మూర్తిని అవమానించేలా ఉన్న ఆ పోస్టర్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విట్టర్ చర్యలు చేపట్టింది. జులై 2న మణిమేగలై పెట్టిన కాళీ పోస్టర్ ను తొలగించింది.

  మరోవైపు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని వచ్చిన పిర్యాదులపై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలో మణిమేగలైపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ వ్యవహరాన్ని కెపడాలోని భారతీయ హైకమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. మరోవైపు ఈ పోస్టర్ కు సంబంధించి మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై కేసు నమోదు అయ్యింది. ఆమెను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతోపాటు అమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్ కతాలో నిరసన చేపట్టారు. అలాగే కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం మేకర్ లీనా మేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్‌పై కెనడాలోని ఇండియన్ హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసి, దీనిని తొలగించాలని చెప్పింది.

  ‘అండర్‌ ది టెంట్’ నుంచి వచ్చిన 18 షార్ట్ వీడియోలలో ఒకటి, దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల అనుకోకుండా హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు గాయపడినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆగా ఖాన్ మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. ‘అండర్‌ ది టెంట్’ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఓ ప్రాజెక్టును నిర్వహిస్తోందని చెప్పింది. దీనిలో భాగంగా వివిధ సాంస్కృతిక, ప్రాంతీయ నేపథ్యాలు గల విద్యార్థులు రూపొందించిన కళా రూపాలను తాము ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. కళల ద్వారా అంతర్ సాంస్కృతిక అవగాహన, చర్చలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు తాము ఆతిథ్యమిస్తున్నట్లు తెలిపింది.

  వేర్వేరు మతపరమైన వ్యక్తీకరణలు, విశ్వాసాలను గౌరవించడం ఈ కార్యక్రమంలో భాగమని తెలిపింది. ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లకు చెప్పింది. ఈ పోస్టర్‌పై హిందూ దేవతలను కించపరుస్తూ ప్రచురించారని తమకు కెనడాలోని హిందూ నేతలు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కాళీ మాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్లు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండాను ధరించినట్లు కనిపించింది.

  అయితే ప్రస్తుతం హిందువులే టార్గెట్ గా ఎన్నో కుట్రలకు తెర తీస్తున్నారు. అందులో భాగంగానే కాళీమాత చేతిలో సిగరేట్ ఉన్న పోస్టర్ ను విడుదల చేశారని జాతీయ వాదులు మండిపడుతున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. టాయిలెట్ల మీద హిందూ దైవాల విగ్రహాలు, చిత్తు కాగితాల్లా మేడలపై నుంచి దైవ చిత్రాలు విసరడాలు, పవిత్ర దైవ చిత్రాలను కాల్చిబూడిద చేయడం, దైవాలను దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇలా ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని జనం మండిపడుతున్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories