ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ల డేటాను రక్షించడానికి ఉద్యోగుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆఫీసుల్లో ఉద్యోగులకు యాక్సెస్ లేదని ఇళ్ళకు వెళ్ళిపోవాలని మస్క్ ఉద్యోగులకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంప్లాయీస్ ని తగ్గిస్తున్నామని కూడా మెమోలో తెలిపారు. ఎంతమందిని తొలగిస్తున్నారన్నది స్పష్టంగా చెప్పలేదు. కానీ తప్పించే వారికి పర్సనల్ గా మెయిల్స్ పంపుతామని, ప్రతి ఒక్కరూ మెయిల్ చెక్ చేసుకోవాలనీ.. స్పామ్ ఫోల్డర్ కూడా చూసుకోవాలని కోరారు. ఎంప్లాయీస్ ని తగ్గించిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రోత్సహించాలని ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారానికి 40 గంటల పాటు పనిచేయాలని ఎలాన్ మస్క్ ఆదేశాలిచ్చారు.
ఇక ట్విట్టర్ సర్వర్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది యూజర్లు తమ అకౌంట్ ఓపెన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. లాగిన్కు ప్రయత్నిస్తే సమ్ థింగ్ వెంట్ రాంగ్, బట్ డోన్ట్ వరీ ట్రై అగైన్ అనే మెసేజ్ కనిపిస్తోందని కొందరు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య వెబ్ వినియోగదారులకు మాత్రమే తలెత్తగా.. మొబైల్లో మాత్రం యాప్ బాగానే పనిచేస్తున్నట్లు తెలిపారు.