National

ట్విట్టర్ కు ఆఖరి ఛాన్స్ ఇచ్చిన భారత ప్రభుత్వం

సోషల్ మీడియా దిగ్గజాలు భారత ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాలని.. లేదంటే దేశంలో బ్యాన్ ను ఎదుర్కోక తప్పదని సూచించింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాయి. కానీ ట్విట్టర్ మాత్రం భారత ప్రభుత్వానికే నీతులు చెప్పాలని భావిస్తోంది. ఇప్పటికే గట్టిగా కౌంటర్ ఇచ్చిన కేంద్రం.. ట్విట్టర్ కు ఆఖరి ఛాన్స్ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే చివరి నోటీసని కూడా హెచ్చరించింది. కొత్త రూల్స్ ను పాటించకపోతే ఐటీ చట్టం 2000లోని 79 సెక్షన్ ప్రకారం అందుబాటులో ఉన్న లయబిలిటీ ఉపశమనాన్ని రద్దు చేస్తామంది. కొత్త ఐటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం ట్విట్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను తొలగించి కొత్త వివాదానికి దారి తీసింది ట్విట్టర్. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లూ టిక్ ను పునరుద్ధరించింది. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ఖాతాకు కూడా బ్లూ టిక్ ను తీసేసింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమేనని ట్విట్టర్ చెబుతోంది. ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వాడని ఖాతాలు ఎన్నో ఉన్నాయని.. వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.

అంతా నేను చేసినట్లే జరగాలని అనుకుంటే ట్విట్టర్ కు కొన్ని దేశాలు షాక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రూల్స్ ను ముహమ్మదు బుహారీ అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. అధ్యక్షుడి ఖాతానే స్తంభింపజేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా ట్విట్టర్ నే దేశంలో బ్యాన్ చేసేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × three =

Back to top button