More

    అగర్వాల్ ను తప్పించేసిన ఎలాన్ మస్క్

    తాను ట్విట్టర్ అధినేత అవ్వగానే పలువురిని ఉద్యోగాల నుండి తీసేస్తానని వస్తున్న వార్తలను ఖండించిన ఎలాన్ మస్క్.. వచ్చీ రాగానే తన మాట తప్పినట్లు తెలుస్తోంది. ట్విటర్‌లోని ఇండియన్‌ సీఈవో అగర్వాల్‌, సెగల్‌తో పాటు లీగల్‌ పాలసీ, ట్రస్ట్‌, సేఫ్టీ హెడ్‌ విజయ గద్దెలను కూడా తొలగించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్విట్టర్‌ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్‌ స్పందిస్తూ.. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని అన్నారు. కానీ ఇప్పుడు కంపెనీలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్లే తప్పుకోవడంతో ఇకపై ట్విట్టర్ టీమ్ లో ఇంకెంత మందిని తొలగిస్తారో అనే టెన్షన్ మొదలైంది.

    ఎలాన్ మస్క్ గురువారం ట్విట్టర్ యజమాని అయ్యారు. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం వచ్చీ రాగానే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌లను తొలగించారని తెలుస్తోంది. ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుండి వెళ్లిపోయారు.. వారు తిరిగి వచ్చే అవకాశం లేదని కథనాలు వచ్చాయి.

    Trending Stories

    Related Stories