మరో నటుడు జిమ్ లో కుప్పకూలి మరణించాడు. బుల్లితెర నటుడు,మోడల్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ(46) అకస్మాత్తుగా కన్నుమూశారు. జిమ్లో వర్కవుట్ చేస్తూ మరణించారు. ఈ ఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అతనికి భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మంచి పేరు సంపాందించారు. గతంలో అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే సిద్ధాంత్ సూర్యవంశీగా మార్చుకున్నారు.
కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కర్ణ్ వంటి షోలలో మంచి పేరు సంపాదించుకున్న సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ శుక్రవారం జిమ్లో కుప్పకూలి మరణించాడు. అతని మరణానికి కారణం ఇంకా తెలియనప్పటికీ, జిమ్ లో కుప్పకూలిపోవడంతో మరణించినట్లు సమాచారం. టీవీ నటుడు జే భానుషాలి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అతడి మరణాన్ని ధృవీకరించారు. సిద్ధాంత్ 2017 లో అలెసియాను వివాహం చేసుకున్నాడు. అతను ఇంతకుముందు ఇరాను వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం ద్వారా ఒక కుమార్తె ఉంది.