More

    ఇస్లాంకు ట్యునీషియా గుడ్ బై..! కొత్త రాజ్యాంగానికి సయీద్ శ్రీకారం..!!

    అది నిన్నటిదాకా ఇస్లామిక్ మత రాజ్యం. అయితే, ఆ దేశాధ్యక్షుడు మార్పు కోరుకున్నారు. అంతే, అనుకున్నదే తడవుగా మతం నీడ నుంచి ప్రభుత్వాన్ని వేరుచేశారు. ఆ రాజ్యం ట్యునీషియా, ఆ అధ్యక్షుడు సయీద్.

    ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యూనీషియాలో ముస్లింలు అధిక సంఖ్యలో వున్నారు. దీంతో, ఇక్కడి రాజ్యాంగం, ఇస్లాంను జాతీయ మతంగా స్వీకరించింది. అయితే, ట్యునీషియా చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ మాత్రం ఎక్కువగా యూరోపియన్ సివిల్ కోడ్ పై ఆధారపడి వుంటుంది. అయితే, షరియా చట్టానికి ఇది వ్యతిరేకం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ట్యునీషియా కొత్త ముసాయిదా రాజ్యాంగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇస్లాంను జాతీయ మతంగా పాటించడానికి చరమగీతం పాడింది. త్వరలోనే కొత్త రాజ్యాంగాన్ని ట్యునీషియా అధ్యక్షుడు సయీద్ ఆమోదించనున్నారు.

    ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన ‘ట్యునీస్ లా స్కూల్’ మాజీ డీన్ సడోక్ బెలైడ్, దేశంలోని కొత్త రాజ్యాంగంలో ఇస్లాం మతానికి సంబంధించిన ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు. 80 శాతం పైగా ట్యునీషియన్లు ఇస్లామిక్ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎలాంటి తీవ్రవాదాన్ని ట్యునీషియన్లు అంగీకరించరని సడోక్ తెలిపారు. ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు సమర్పిస్తామని స్పష్టం చేశారు.

    గతేడాది ట్యునీషియా పార్లమెంట్ రద్ధయ్యింది. ఆ తర్వాత, 2021 జూలై నెలలో సయీద్ పూర్తి అధికారాలను స్వీకరించారు. ట్యునీషియా చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ యూరోపియన్ సివిల్ కోడ్ పై ఎక్కువగా ఆధారపడి వున్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సయీద్, అనేక మంది మేధావులతో సమాలోచనల జరిపి.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అయితే, ఇస్లాం మతాన్ని దేశం నుంచి వేరు చేయాలనే సయీద్ భావన తప్పని.. ఆ దేశానికి చెందిన పలువురు రాజకీయ నేతలు అంటున్నారు. సయీద్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఇది రాజకీయాల్లో అతిపెద్ద అవినీతి, నిరంకుశత్వం అని ఇస్లామిక్ పార్టీ నాయకుడు ఎన్‌హాడా, రాజకీయ నాయకుడు రాచెడ్ ఘన్నౌచిలు వ్యాఖ్యానించారు.

    ఇస్లాం మతం, అరబిక్ ట్యునీషియా భాష అని అప్పట్లో రాజ్యాంగంలో రాయబడింది. అయితే, చరిత్రను కూలంకషంగా పరిశీలించిన సయీద్.. సంస్కరణల బాట పట్టారు. ఈ నెల ప్రారంభంలో దేశంలోని 57 మంది న్యాయమూర్తులకు సయీద్ ఉద్వాసన పలికారు. ఈ న్యాయవాదులు, అన్యాయ మార్గంలో ముందుకు వెళుతున్నారని సయీద్ ఆరోపించారు. అవినీతిపర్వాన్ని యధేచ్ఛగా సాగిస్తూ.. ఉగ్రవాదులను అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. ఈ కారణంగానే సదరు లాయర్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. అయితే, సయీద్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తుండగా, న్యాయమూర్తులు దేశవ్యాప్త సమ్మెకు దిగారు.

    spot_img

    Trending Stories

    Related Stories