More

    సొంత పార్టీల ఎమ్మెల్యేల ప్రశ్నలతో జీరో అవర్ రద్దు.. టీఆర్ ఎస్ సర్కారు తీరును ఎండగడుతున్న విపక్షాలు

    జీరో అవర్‌‌లో సభ్యులు ప్రస్తావించే సమస్యలకు ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాధానాలు రావట్లేదని టీఆర్ఎస్‌‌కు మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తము అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేదని ఆవేదన చెందారు. సభలో మంత్రులు నోట్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారే తప్ప ఆన్సర్‌‌ రావట్లేదన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు జోక్యం చేసుకుని.. సంబంధిత శాఖల కార్యదర్శులు జీరో అవర్‌‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్నారు.

    అసలు రోడ్లేయరా?
    డయాలిసిస్ సెంటర్ ఏమైంది?
    మాటిచ్చి అమలు చేయట్లేదు?
    పదేళ్లుగా జూరాల గేట్లు రిపేర్ చేయట్లే ?
    సొంతూరికి రోడ్డేయించలేదని విమర్శిస్తున్నరు ?
    ఉప్పల్ కారిడార్ పనులు స్లో అవుతున్నాయి ?
    బాసర త్రిపుల్ ఐటీలో మస్తు సమస్యలున్నాయి ?
    కరెంట్ తీగలతో ప్రాణాలు పోతున్నయ్ ?
    ఇలా పదులకొద్దీ ప్రశ్నలు..
    ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 20, 22 తేదీల్లో జరిగిన జీరోఅవర్ లో..!
    అయితే ఈ ముప్పేట దాడి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నుంచి అనుకుంటే పొరబాటే.. ఎందుకంటే అధికార టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఈ ప్రశ్నలను సంధించింది. తమ నియోజక వర్గంలో నెలకొన్ని ప్రజా సమస్యలపై ఎవరికి వారు ప్రశ్నలేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. రెండ్రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ దెబ్బకు సర్కారు ఆగమాగమైంది. వీళ్లు ఇట్లే ప్రశ్నలడిగితే ప్రభుత్వం పరువు పోతుందని ఏకంగా జీరో అవర్‌‌నే ఎత్తేసింది.
    ఆ రెండు రోజుల్లో సుమారు 46 అంశాలను సభ్యులు సభలో ప్రస్తావించారు. రెండు, మూడు అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మిగతా సమస్యలను టీఆర్ఎస్ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. తమ సెగ్మెంట్లలో మస్తు సమస్యలున్నాయని, పట్టించుకోరా అని నిలదీశారు. రాష్ట్రంలో సమస్యల్లేవని, జనం సంతోషంగా ఉన్నారని సభలో మంత్రులు చెబుతుంటే.. సమస్యలతో ఇబ్బందిపడుతున్నామని ఎమ్మెల్యేలు చెప్పడం సర్కారుకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రాబ్లమ్స్‌ ‌పై నిలదీయడంపై ప్రగతిభవన్ వర్గాల్లో చర్చ జరిగినట్టు తెలిసింది. జీరో అవర్‌‌లో ఎక్కువ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ఎక్కువ సమస్యలు ఫోకస్ అవుతున్నాయని ఓ మంత్రి చెప్పారు. కేసీఆర్‌‌ను కలిసే అవకాశం లేక అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తున్నారని అన్నారు.
    జీరో అవర్‌‌లో సభ్యులు ప్రస్తావించే సమస్యలకు ప్రభుత్వం నుంచి రాతపూర్వక సమాధానాలు రావట్లేదని టీఆర్ఎస్‌‌కు మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తము అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేదని ఆవేదన చెందారు. సభలో మంత్రులు నోట్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారే తప్ప ఆన్సర్‌‌ రావట్లేదన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు జోక్యం చేసుకుని.. సంబంధిత శాఖల కార్యదర్శులు జీరో అవర్‌‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్నారు.
    ప్రస్తుతం ఈ అంశాన్ని విపక్షాలు సాగర్ ఎన్నికల ప్రచారంలో ప్రచార అస్త్రంగా వాడే అవకాశాలున్నాయి. సొంత పార్టీ నేతలే ఇంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. ఇక ప్రజల మంచి చెడులను ఈ ప్రభుత్వం ఏం చూడగలదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.

    Related Stories