More

  అయెధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ పై అసత్య ఆరోపణలు

  ఒక వ్యక్తిపై కానీ, లేదా ఏదైనా సంస్థపై కానీ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పొగొట్టాలంటే ఏమి చేయాలి.? సింపుల్ గా వారిపై అభూతకల్పనలు…, అనుమానాలు రేకెత్తించేలా కామెంట్లు చేయాలి? ఇక్కడ కామెంట్లు అనే కంటే కూడా.. బురద జల్లాలి అంటే బాగుంటుదేమో.!


  అలా ఈ నేతలు అసత్య ఆరోపణలు చేయగానే.., వెంటనే లెఫ్ట్ లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు, తెలుగు మీడియా చానళ్లు, వారు చేసిన ఆరోపణలకు మరింత మసిపూసి, కట్టుకథలతో నిజమేనన్నట్లగా కథనాలు… ప్రసారం చేస్తాయి.
  ఇంకేముంది..! అప్పటి వరకు ఆ వ్యక్తిపైకానీ, ఆ సంస్థపైకానీ ., నమ్మకంతో ఉన్న జనంలో.., డౌట్ మొదలవుతుంది. వందమంది జనంలో.. ఓ టెన్ పర్సెంట్ జనంలోనైనా డౌట్ రైజ్ అయ్యేలా చేయగలిగితే చాలు.., లెఫ్ట్ లుటియెన్స్ మీడియా, తెలుగు చానళ్లు సక్సెక్స్ అయినట్లే.!

  ఎందుకంటే..? జనంలో ఒకసారి నాటుకు పోయినా ఈ డౌట్ పర్మినెంట్ గా రికార్డు అయిపోతుంది. ఈలోగా ఆయా సంస్థలు, వ్యక్తులు డిఫెన్స్ లో పడి…, తాము తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చుకునేలోగా లెఫ్ట్ లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు, తెలుగు చానళ్లు…, మరో అంశాన్ని తెరపైకి తీసుకువస్తాయి. ఇక ఆయా సంస్థలు, వ్యక్తులు తాము నిర్దోషులమని, ఏ తప్పు చేయలేదని, అంతా పారదర్శకంగానే జరుగుతోందని ఎన్ని ఆరాధాలు చూపినా… వాటిని ప్రసారం చేసేందుకు స్పెస్ అనేది లేకుండా చేస్తాయి. పైగా తాము హెడ్డింగులు పెట్టి ప్రచురించి ప్రసారం చేసిన న్యూస్ కు విరుద్ధంగా తప్పు జరిగింది అంటూ క్లారిటీగా వివరణ ఇవ్వాలంటే లెఫ్ట్ లుటియెన్స్ మీడియాకు, మన తెలుగు చానళ్లకు ఉండే ఈగో తెలిసిందే కదా…! అవి ఎందుకు అలా చేస్తాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ముసుగులో బుదర జల్లడమే వాటి పని అన్నట్లుగా ఇప్పటికీ వ్యవహారిస్తున్నాయి.


  నిజమనేది… చీరకట్టుకుని సింగారించుకునేలోపు…అబద్దమనేది ఊరంతా తిరిగి వస్తుందనే సామెత ఊరికే రాలేదు. రాజకీయాల్లో ఉండేవాడికి నీతి నిజాయితీ, పాప భీతి, ధర్మమనేది ఉండదని అంటారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేస్తారు. అందులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం…, పైగా శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం అంశం కూడా.., అధికార బీజేపీకి ఓట్లు తెచ్చి పెట్టే ప్రచారాస్త్రంగా మారిందన్నది నిజం. అయితే ఇదే ఇప్పుడు యూపీలోని ప్రధాన విపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇంకా రాముడే లేడు అన్న కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారిందని నెటిజన్లు అంటున్నారు.


  ఈ క్రమంలోనే అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ పై సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు.
  ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన ఆరోపణలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖండించింది. ప్రస్తుతం జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంక్ ద్వారానే జరిగిన విషయం మనం మర్చిపోరాదు. ఎక్కడ కూడా ట్రస్ట్ నగదు చెల్లింపులు జరపలేదు.

  ప్రస్తుతం తీర్థక్షేత్ర ట్రస్ట్ కొన్న స్థలం అయోధ్య రైల్వే స్టేషన్ కు సమీపంలోని ముఖ్యమైన కూడలికి దగ్గరలో ఉంది. అయోధ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు సంబంధించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థలాన్ని కొనాలని తీర్థక్షేత్ర ట్రస్ట్…నిర్ణయించింది. అయితే ఆ భూమి యజమానులైన శ్రీమతి కుసుమ పాఠక్, శ్రీ హరీష్ పాఠక్ లు 2010లోనే ఈ భూమిని సుల్తాన్ అన్సారీతోపాటు మరికొంతమందికి అమ్మటానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో భూమి మార్కెట్ విలువ రూ. 2 కోట్లు. దీంతో … కుసుమ్ పాఠక్ తో అగ్రిమెంట్ చేసుకున్న సుల్తాన్ అన్సారీ, రవి మోహన్ తివారీలను తీర్థక్షేత్ర ట్రస్ట్ సంప్రదించింది.


  ఒప్పందం ప్రకారం అయితే కుసుమ పాఠక్ ఆ భూమిని ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న సుల్తాన్ అన్సారీకి, అలాగే రవి మోహన్ తివారీలకు అమ్మాలి. పూర్వ ఒప్పందం ప్రకారం అది రెండు కోట్లు కాగా.., ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ల్యాండ్ రెవెన్యూ లెక్కల ప్రకారం ఆ భూమి మార్కెట్ విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని తెలింది. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే…ఈ భూమిని రూ.18.50 కోట్ల రూపాయలకు కొనడానికి క్రయ విక్రేతలు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రెండు లావా దేవీలు కూడా ఒకదాని తర్వాత మరొకటి జరగాలి. అందుకే అవసరమైన స్టాంప్ పేపర్ లు ఒకే వ్యక్తి తీసుకున్నాడు. దీంతో ఈ లావాదేవీల్లో ఏది మొదలు చేశారు. ఏదీ తర్వాత చేశారనే అనుమాన ఔచిత్యాలేనవి లేవని గుర్తుపెట్టుకోవాలి. అయితే కోనుగోలుకు సంబంధించి… సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకుని తమ అనుకూల మీడియాలో.., శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పై అసత్య ఆరోపణలను ప్రచారం చేశారు. వీరంతా కూడా శ్రీరామజన్మభూమిలో మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారేననే విషయం మనం మర్చిపోరాదు.


  తీర్థక్షేత్ర ట్రస్ట్ తోపాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లపై అనుమానాలు నెలకొనేలా అసత్య ఆరోపణలకు ఇంకా కూడా పాల్పడుతున్నారు. ప్రస్తుతం… తీర్థక్షేత్ర ట్రస్ట్ తమపై అసత్య ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీల నేతలపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉంది. తమపై చేసిన ఆరోపణలను… కోర్టులో పరువు నష్టం వేసే దావాతోనే ముగించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు. అన్నట్టు చెప్పడం మరిచాను.., ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఆరోపణలు చేయడం… ఆ తర్వాత గప్ చుప్ గా క్షమాపణలు చెప్పడం అలవాటే. గతంలో అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లు.. బీజేపీ నేత అరుణ్ జైట్లీపై , అలాగే మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత., తాము తప్పుడు ఆరోపణలు చేశామని.., తమను క్షమించమని.., జైట్లీని, నితిన్ గడ్కరీని వేడుకున్నారనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. సో… తీర్థక్షేత్ర వేసే పరువు నష్టం దావాలో మళ్లీ ఈ నేతలు క్షమాపణలు చెప్పడం ఖాయం.

  Trending Stories

  Related Stories