More

    ట్విట్టర్ లోకి తిరిగొచ్చిన డొనాల్డ్ ట్రంప్

    ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా పునురుద్ధరణ విషయంలో ఎలాన్‌ మస్క్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై బ్యాన్‌ను తొలగించినట్టు స్పష్టం చేశారు. దీంతో ట్విట్టర్‌లోకి డొనాల్డ్‌ ట్రంప్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్‌ ఖాతాను ఎట్టకేలకు ట్విట్టర్‌ పునరుద్ధరించింది. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ దాడి తర్వాత ట్రంప్‌ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ బ్యాన్‌ చేసింది.

    ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై ఎలాన్‌ మస్క్‌ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. ట్రంప్ ఖాతాను మళ్లీ తీసుకుని రావాలా వద్దా అన్న దానిపై పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ లో దాదాపు51.8% మందికి పైగా మంది పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఖాతాపై ఉన్న నిషేధాన్ని తొలగించి, తీసుకుని వస్తున్నామని మస్క్ ట్వీట్ చేశారు.

    Trending Stories

    Related Stories