సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్సగ్రేషియో ప్రకటించింది. రాకేష్ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన పోలీస్ కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లనే అగ్నిపథ్ ఒక యువకుడి ప్రాణాలను బలికొనిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
రాకేశ్ మృతదేహానికి స్వగ్రామమైన నర్సంపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాకేశ్ మృతదేహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాకేశ్ మృతిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేడు నర్సంపేట నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. వరంగల్ ఎంజీఎంలో ఉన్న రాకేశ్ మృతదేహాన్ని నేడు నర్సంపేట తరలించనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.