More

    11వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యం

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. 11వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 5,774కి పెరిగింది. 11వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యం లభించింది. 11వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ కు 74,565 ఓట్లు, బీజేపీకి 68,800 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 16,280 ఓట్లు లభించాయి. గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాలు లెక్కించాల్సి ఉండగా.. ఈ మూడు మండలాల్లో భారీగా ఓట్లు లభిస్తాయని బీజేపీ భావిస్తోంది.

    పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,499 ఓట్లు లభించగా, బీజేపీకి 7,015 ఓట్లు వచ్చాయి. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ 4,407 ఓట్లకు చేరింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ కు మొత్తం 67,330 ఓట్లు, బీజేపీకి 62,923 ఓట్లు, కాంగ్రెస్ కు 14,596 ఓట్లు లభించాయి.

    Trending Stories

    Related Stories