More

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

    మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీని కోరారు. రూ.18 వేల కోట్ల పనులు తీసుకుని, మునుగోడులో ఓట్లు కొంటున్నారని వివరించారు. ఆ రూ.18 వేల కోట్లలో ఈటల రాజేందర్ కు కూడా వాటా ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని, రాజగోపాల్ రెడ్డి ని డిస్ క్వాలిఫై చేయాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టివి చానల్ లో స్వయంగా చెప్పారని, ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గాలికి వదిలేశారని, క్విడ్ ప్రో కో కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల అధికారిని కోరినట్లు టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని, ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దని ఎన్నికల అధికారిని కోరుతున్నట్లు తెలిపారు.

    అయితే తన మీద వచ్చిన ఆరోపణలను.. 24 గంటల సమయంలో నిజమని నిరూపించాలని.. లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

    Trending Stories

    Related Stories