వీరు వేసింది ఏ మాల అంటే..?

0
799

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు మాలలో ఉన్నారు. ఇదేమి మాల.. మేమెప్పుడూ చూడని వస్త్రధారణతో ఉన్నారని అనుకుంటున్నారా..? వీరు వేసింది దేవుడి మాల కాదు..! ఓ వ్యక్తి మాల. గతంలో కూడా తెలుగు ప్రజలు.. కొందరు ప్రముఖ వ్యక్తులు చనిపోయాక వేసిన మాలల గురించి మనం విన్నాం.. చూశాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు వేసింది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాల. అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే ఉంటారు అనే డైలాగ్ ను వీరు నిరూపించేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకోసం పవన్ కళ్యాణ్ మాల వేశారు.

పవన్ అభిమానులు ‘పవన్ మాల’ ధరించి దీక్ష చేపట్టారు. ఇప్పుడు ‘పవన్ మాల’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయవాడకు చెందిన అభిమానులు కొందరు పవన్ 49వ జన్మదినోత్సవం సందర్భంగా ‘పవన్ మాల’ను స్వీకరించి దీక్ష తీసుకున్నారు. ఇందులో భాగంగా డాలర్‌తో కూడిన మాలలను, ఎర్ర కండువాలను ధరించారు. మెడలో అన్ని మతాలకు చెందిన చిహ్నాలు వేసుకున్నారు. దీక్ష చేపట్టినవారు మండలకాలంలో పవన్ కార్యక్రమాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఎన్నికల్లో ఆయన విజయం కోసం ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పవన్‌ స్ఫూర్తితో తాము కూడా ప్రజా సేవ చేస్తామని వారు ప్రకటించారు. ఈ కొత్త మాలకు సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి.