More

    రైతుల నిరసనల వల్లే పెరుగుతున్న కరోనా కేసులు: పంజాబ్ మినిస్టర్

    రైతు చట్టాల విషయంలో ఎన్నో రాజకీయాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! రైతుల బాగు కోసం కేంద్రప్రభుత్వం తీసుకుని వచ్చిన పథకాలను వారికి తప్పుగా అర్థమయ్యేలా చెప్పి.. ప్రభుత్వానికి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో కొందరు నాయకులు రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారు. కరోనా కాలంలో కూడా రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు.

    పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతూ ఉండడానికి రైతుల ఉద్యమమే కారణమని పంజాబ్ మినిస్టర్ త్రిప్త్ రాజేందర్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూస్ 18 మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో కోవిద్-19 కేసులు పెరగడానికి రైతుల నిరసన ప్రదర్శనలే కారణమని అన్నారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతూ ఉన్నాయని ప్రశ్నించగా.. అందుకు కారణం రైతులు నిరసనల్లో పాల్గొని రావడమే కారణమని అన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్ లు కూడా తక్కువగా జరుగుతూ ఉన్నాయని అన్నారు. సింగు, టిక్రి బోర్డర్ నుండి రైతులు గ్రామీణ ప్రాంతాలకు వెల్తూ ఉన్నారని.. అలా వెళ్లిన వారి కారణంగానే రాష్ట్రం కరోనా ఉధృతి పెరగడానికి కారణమైందని అన్నారు. త్రిప్త్ రాజేందర్ సింగ్ పలు శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పెద్దగా టెస్టింగ్ లు కూడా జరగలేదని.. ఇకపై టెస్టింగుల సంఖ్య పెంచబోతూ ఉన్నామని అన్నారు.

    నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న రైతులు కరోనా కారణంగా మరణిస్తూ ఉన్నారు. పల్లెల నుండి కొందరు వెళ్లడం.. నిరసనల్లో పాల్గొనడం..! ఆ తర్వాత ఇంట్లో ఉన్న మరికొందరు కొద్దిరోజుల పాటూ నిరసనల్లో పాల్గొంటూ.. షిఫ్టుల ప్రకారం నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అలా వెళ్లి రావడం వలన పంజాబ్ లోని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా కరోనా మహమ్మారి ఎంటర్ అయ్యింది. పంజాబ్ ప్రభుత్వం మాత్రం రైతుల నిరసనలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు రైతు నేతలతో చర్చలను చేపట్టినప్పటికీ.. రైతు నేతలు నిరసన కార్యక్రమాలకు స్వస్తి చెప్పడం లేదు.

    Related Stories