More

    యాదవ అహీర్ జవాన్లకు ఘన నివాళి

    సరిహద్దులో అమరులైన 114 మంది యాదవ అహీర్ జవాన్లకు దేశవ్యాప్తంగా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ అన్నారు. నవంబర్ 18న దేశం కోసం ప్రాణాలర్పించిన యాదవ్ జవాన్లను స్మరించుకుంటూ రేజంగ్లా డేను “యాదవ్ శౌర్య దివాస్”గా అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షుడు విజయ్ యాదవ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి ధారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు రమేష్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ తదితరులు యాదవ అమర జవాన్లకు నివాళి అర్పించారు. అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

    ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ దేశ యుద్ధ ఇతిహాసాల్లో ప్రముఖంగా ఉండదగ్గ రేజింగ్లా యుద్ధం గురించి చరిత్రలో ఒక్క పుట కూడా లేకపోవడం బాధాకరమన్నారు. సుమారు 16వేల అడుగుల ఎత్తులో 25డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలో చాశుల్ అనే ప్రాంతంలో ఆయుధ సంపత్తి లేకున్నా ప్రతి సైనికుడు 100 మంది చైనీయుల సైన్యాన్ని మట్టుబెట్టాలన్న దృఢసంకల్పంతో “లాస్ట్ మ్యాన్ లాస్ట్ బులెట్” అనే నినాదంతో పోరాడారని చెప్పారు. చివరికి తమ వద్ద ఉన్న ఆయుధ తూటాలు అయిపోయిన వెనుకంజ వేయకుండా ఎదురెళ్లి పిడిగుద్దులు, ముష్టి ఘాతాలతో చైనీయులను నిలువరించి మన దేశ సరిహద్దులను, దేశ ప్రజలను కాపాడిన 114 మంది యాదవ అమర జవాన్ల చరిత్ర ఇప్పటివరకు చాలా మందికి తెలియకపోవడం, ఏ పాఠ్య పుస్తకంలోనూ చేర్చకపోవడం బాధాకరమన్నారు. దేశాన్ని కాపాడిన యాదవ జవాన్లకు ఒక పరం వీర్ చక్ర, ఒక మహావీర్ చక్ర, 6 వీర్ చక్ర, 8 సేన పతకాలను అప్పటి ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేజంగ్లా యుద్దాన్ని గుర్తించి అహిర్ రెజిమెంట్‎ను పునః స్థాపించాలని అఖిల భారత యాదవ మహా సభ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు, సైనికులకు దేశం పట్ల ప్రేమ, భక్తి, ఉత్తేజాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసిన యాదవ అహిర్ జవాన్ల పేరిట దశాబ్దాలుగా అఖిల భారత యాదవ మహాసభ అధ్వర్యంలో కలెక్టర్లు, పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, రక్షణ మంత్రికి చేస్తున్న డిమాండ్‎కు స్పందించి వెంటనే అహిర్ రెజిమెంట్‎ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

    Trending Stories

    Related Stories