మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌ లలో భూ ప్రకంపణలు

0
637

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.6గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

అరుణాచల్ ప్రదేశ్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని బాసర్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7.01 గంటలకు బాసర్‌లో భూకంపం వచ్చిందని.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. బాసర్‌కు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు తెలిపారు.