More

    చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలమనేరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి, గంటఊరు తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయి. గోడలు స్వల్పంగా బీటలువారాయి. పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    Trending Stories

    Related Stories