హిందువులపై దాడికి 200 మందికి ట్రైనింగ్..! నిజామాబాద్‎లో నిషేధిత శిక్షణ కేంద్రం..!!

1
842

హిందువులపై దాడికి ముస్లిం వర్గం కుట్రలు పన్నుతోంది. అటాక్ చేసేందుకే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మతాల మధ్య వైషమ్యాలు పెంచి పరస్పరం దాడులు చేసుకునేలా లేదా ఎదుటిమతంపై దాడులు చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.

నిజామాబాద్ కేంద్రంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి అందులోకి యువతను చేర్చుకుని హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ ఇస్తున్న కేంద్రం నిర్వాహకుడు కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. స్థానిక ఆరో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్‌ ఖాదిర్‌ స్థానికంగా మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.

సిమీ అనే ఉగ్రవాద సంస్ధలో శిక్షణ తీసుకుని ఆ సంస్ధలోనే చాలాకాలం పనిచేసిన ఖాదర్ బయటకు వచ్చేసి కొత్తగా పీఎఫ్ఐ అనే సంస్ధను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ శిక్షణా కేంద్రంపై అనుమానం రావటంతో నిఘాపెట్టారు. తమ అనుమానం నిర్ధారణకావటంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడిచేశారు. కరాటే శిక్షణ ముసుగులో యువకులను పెద్దఎత్తున చేర్చుకుంటూ హిందుమతానికి వ్యతిరేకంగా భావజాలాన్ని నూరిపోస్తున్నారు. ఇదే సమయంలో హిందుమతానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయాలి ఎవరెవరిపై దాడులు చేయాలనే విషయాలను ఖాదర్ యవకులకు ప్రతిరోజు శిక్షణిస్తున్నట్లు నిర్ధారణైంది.

ఈ రెండు, మూడు ఏళ్లల్లో తెలుగురాష్ట్రాల్లోని భైంసా, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది యువకులకు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చాడు. హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ తీసుకున్న ఈ యువకులంతా ఎక్కడెక్కడున్నారు ఏమి చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ శిక్షణా తరగతులకు పలు రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ పీఎఫ్‌ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లామ్‌కు అనువైన శక్తులుగా తయారు చేస్తుంటారని తెలిపారు. వీరిని దేశంలో ఇతర మతస్తులపైకి ఊసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేసి షరియత్‌ వ్యవస్థను స్థాపించడమే పీఎఫ్‌ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పని చేస్తుదన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాన్‌చాకులు,కర్రలు, వెదురు బొంగులు, సాహిత్యం, బ్యానర్లు, బస్సు, ట్రైన్‌ టికెట్లు సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.

పీఎఫ్ఐ ద్వారా మతపరమైన ట్రైనింగ్ ఇవ్వటమే తన ధ్యేయమని ఖాదర్ పోలీసుల విచారణలో అంగీకరించారట. తన దగ్గర శిక్షణ తీసుకున్న యువకులు ఇపుడు ఎక్కడెక్కడున్నారో తనకు తెలియదని చెప్పాడట. శిక్షణా తరగతులు నిర్వహించటానికి యువతను ఆకర్షించటానికి అవసరమైన నిధులను తనకు బయటనుండి వస్తున్నట్లు అంగీకరించాడు. ఎక్కడెక్కడి నుండి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఖాదర్ చెప్పలేదు. అందుకనే ఆయన బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికి బయటపడింది నిజామాబాద్ కేంద్రంలోని ట్రైనింగ్ సెంటర్ ఒకటే. ఇలాంటి సెంటర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

1 Comment

  1. When one Khasab had created so much of damage, we don’t know how much damage will happen with these 200 Khasabs… Intelligence department should take care this issue very seriously.

    They may target Hindus or Muslim brothers and sisters also to create nuisance in the society…

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 4 =