నల్గొండ జిల్లాలో కూలిన విమానం

0
715

న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర మండ‌లం రామ‌న్న‌గూడెం తండా వ‌ద్ద ఓ హెలికాఫ్టర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. పైల‌ట్‌తో పాటు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మ‌హిమ‌ మృతి చెందిన‌ట్లు అధికారులు గుర్తించారు. మ‌హిళ త‌మిళ‌నాడుకు చెందిన అమ్మాయి. హెలికాప్ట‌ర్ కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. ఆ హెలికాప్ట‌ర్ నాగార్జున సాగ‌ర్ వైపు నుంచి వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు.ఆ హెలికాప్ట‌ర్ నాగార్జున సాగ‌ర్‌లోని విజ‌య‌పురి సౌత్ ఏవియేష‌న్ అకాడ‌మీకి చెందినదిగా అధికారులు గుర్తించారు.

పెద్ద‌వూర మండ‌లం రామ‌న్న‌గూడెం తండా వ‌ద్ద చాప‌ర్ కుప్ప‌కూలింది. మ‌రో పైల‌ట్ వివ‌రాలు తెలియాల్సి ఉంది. పైల‌ట్ల శ‌రీర భాగాలు ముద్దలు ముద్ద‌లుగా, గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో ఉన్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషిస్తున్నారు. శిక్ష‌ణ హెలికాప్ట‌ర్ కూలిన విష‌యాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. విమానం కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని స్థానికులు పేర్కొన్నారు. ద‌ట్ట‌మైన మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ప్ర‌మాదానికి గురైన చాప‌ర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు. హైటెన్ష‌న్ విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో అదుపుత‌ప్పి చాప‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.