More

    భారత ఆర్మీకే చెడ్డపేరు ఈ సినిమా: మాంటీ పనేసర్

    గత కొన్ని వారాలుగా, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 1994 లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ ఇది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని భారతదేశంలో చాలా మంది పిలుపును ఇస్తూ వస్తున్నారు. ‘#BoycottLaalSinghChaddha’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో అసహనం పెరుగుతోంది అంటూ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఇక సినిమా చూసిన వాళ్లు ఒరిజినల్ ను చెడబెట్టారని కూడా చెబుతున్నారు.

    భారత్ లోని పంజాబ్‌లో తన మూలాలను కలిగి ఉన్న మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ కూడా సినిమాను బహిష్కరించాలని పిలుపును ఇచ్చారు. లాల్ సింగ్ చద్దా సినిమా బహిష్కరణకు మద్దతుగా ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఫారెస్ట్ గంప్ సినిమా కథ ప్రకారం అతడు US సైన్యంలో సరిపోతాడు, ఎందుకంటే వియత్నాం యుద్ధ అవసరాలను తీర్చడానికి అమెరికా తక్కువ IQ పురుషులను నియమించుకుంది. ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు భారత ఆర్మీకి, సిక్కులకు పూర్తిగా అవమానంకరంగా ఉన్నాయి. సినిమాను బహిష్కరించడమే ఉత్తమమైన మార్గం అని అన్నారు పనేసర్. “Forrest Gump fits in the US Army because the US was recruiting low IQ men to meet requirements for the Vietnam War. This movie is total disgrace to India Armed Forces Indian Army and Sikhs !!Disrespectful. Disgraceful. #BoycottLalSinghChadda,” Panesar wrote, as he attached a picture of the movie’s poster. అంటూ తన ట్వీట్ లో వెల్లడించారు పనేసర్. మరో ట్వీట్‌లో, భారత సైన్యంలో పనిచేసిన సిక్కులకు భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను, అందుకున్న పురస్కారాల సంఖ్యను పనేసర్ చెప్పుకొచ్చారు.

    అమీర్ ఖాన్ సినిమా విడుదలకు ముందు ముంబైలో విలేఖరులతో మాట్లాడుతూ సినిమాను చూడాలని ప్రజలను అభ్యర్థించారు. “బాలీవుడ్‌ని బహిష్కరించాలి… అమీర్‌ఖాన్‌ను బహిష్కరించాలీ… లాల్ సింగ్ చద్దాను బహిష్కరించాలి అని కొందరు అంటున్నారు. నేను భారతదేశాన్ని ఇష్టపడని వ్యక్తని కొంత మంది ప్రజలు నమ్ముతున్నందుకు నేను కూడా బాధపడుతున్నాను. అది అవాస్తవం” అని అమీర్‌ ఖాన్ చెప్పుకొచ్చారు. “నేను దేశాన్ని నిజంగా ప్రేమిస్తున్నాను… నేను అలానే ఉన్నాను. కొంతమంది అలా భావిస్తే అది దురదృష్టకరం. నేను అలాంటి వ్యక్తి కాదని అందరికీ చెబుతున్నాను. కాబట్టి దయచేసి నా చిత్రాలను బహిష్కరించవద్దు.. నా సినిమాలు చూడండి.” అని అమీర్ ఖాన్ అన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories