భారీగా పెరిగిన టమాటా ధర

0
675

అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.88 వరకు పలికింది. మార్కెట్‌కు సరకు తక్కువగా వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం రైతులు 155 టన్నులు మాత్రమే తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో రోజూ 700 టన్నుల నుంచి 900 టన్నుల వరకు రావాల్సి ఉండగా, దిగుబడి తగ్గడంతో రైతులు టమాటాను తక్కువగా తీసుకొస్తుండడంతో ధరలు వారం రోజులుగా పెరుగుతూ వెళుతున్నాయి.

రెండు నెల‌ల క్రితం వ‌ర‌కు ట‌మాటా ధ‌ర‌లు విప‌రీతంగా ప‌డిపోయాయి. అయితే, వారం రోజులుగా వాటి ధ‌ర‌లు పైపైకి వెళ్తున్నాయి. ట‌మాటా దిగుబ‌డులు త‌గ్గ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మదనపల్లె మార్కెట్ నుంచి ఏపీలోని ప‌లు జిల్లాల‌కే కాకుండా దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు కూడా ట‌మాటాలు ఎగుమ‌తి చేస్తారు. రాబోయే రోజుల్లో టమాటా ధ‌ర‌లు మ‌రింత పెరిగిపోయే అవ‌కాశం ఉంది.