వర్ధమాన నటుడు ప్రియాంత్ రావు అరెస్ట్

0
1300

వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా.. అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు తన ఫిర్యాదులో.. ‘‘కొత్తగా మా ప్రయాణం’’ సినిమా సమయంలో జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడిందని అన్నారు. పరిచయం అయిన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఒక రోజు హైదరాబాద్‌ శివార్‌లో ప్రగతి రిసార్ట్‌‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించింది. చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో నిందితుడు మొహం చాటేసినట్లు ఆమె తెలిపింది. అబార్షన్ కోసం మెడిసెన్స్ ఇవ్వడంతో అనారోగ్యం పాలయ్యానని, అంతేకాకుండా విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలియజేసింది.