More

    టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత..!

    టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాలలో ఆయన నటించారు. కమెడియన్ గా, విలన్ గా ఆయన చేస్తూ వచ్చారు. సినీ రంగంలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ.. టాప్ హీరోలు, హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories