టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన సొమ్మసిల్లి కిందపడిపోయారు. దీంతో అతన్ని చిత్ర యూనిట్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు నాగశౌర్యకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నాగశౌర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇటీవలే బెంగళూరుకు చెందిన బిజినెస్ వుమెన్ అనూష శెట్టితో నాగశౌర్యకు వివాహం నిశ్చయమైంది. నవంబర్ 20న బెంగళూరులో వివాహం జరగనుంది. నాగశౌర్య ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.