యువ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కిరణ్ సోదరుడు రామానుజులు రెడ్డి కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. చెన్నూరు వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం ప్రముఖ సీనియర్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ వంటి చిత్రాలతో కిరణ్ అబ్బవరం నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో సోదరుడి మరణం కిరణ్ ను తీవ్ర విషాదానికి గురిచేసింది. కిరణ్ అబ్బవరం తమ్ముడు రామానుజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం బాధాకరం. కడప జిల్లా చెన్నూరు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామానుజులు రెడ్డి తీవ్ర గాయాలతో కన్నుమూశారు. కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి కడప జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం కారులో ప్రయాణిస్తుండగా.. కడప జిల్లా చెన్నూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామాంజులు రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎస్.ఆర్.కళ్యాణ మండపం చిత్రం ఇంకా మంచి విజయాన్ని సాధించింది. యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ , మత్తు వదలరా వంటి సినిమాను నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా కిరణ్ అబ్బవరం హీరోగా సినిమాను నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.