More

    టాలీవుడ్ లో మరో విషాదం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత..!

    ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోల పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

    భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్టులలో ఒకరు. సూర్యకు సింగం సినిమాలో డబ్బింగ్ చెప్పడంలో మూర్తి భారీగా ఫాలోయింగ్ ను సంపాదించారు. మూర్తి తన కెరీర్ ను 1990లలో ప్రారంభించారు. అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, తమిళ సూపర్ స్టార్ అజిత్ తదితరులకు కూడా మూర్తి డబ్బింగ్ చెప్పారు. మలయాళం నుండి డబ్ చేసిన చాలా సినిమాలకు తెలుగులో డబ్ చేశారు. మోహన్ లాల్, ఉపేంద్రకు కూడా డబ్బింగ్ చెప్పాడు. విక్రమ్ ‘అపరిచితుడు’ విడుదల తర్వాత మూర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులారిటీ సంపాదించారు. 2000లో వచ్చిన ‘సఖి’ సినిమాలో కూడా మాధవన్ కు డబ్బింగ్ చెప్పారు. మాధవన్ నటించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అతని చివరి సినిమాలలో ఒకటి. ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాల్లో జయరామ్‌కు గాత్రదానం చేశారు.

    Trending Stories

    Related Stories