ఆసుపత్రి పాలైన టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు

0
831

టాలీవుడ్ హీరో శ్రీ‌విష్ణు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీ‌విష్ణు తీవ్ర‌మైన వైరల్ ఫీవ‌ర్‌తో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న ప్లేట్లెట్స్ కౌంట్ బాగా ప‌డిపోవ‌డంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈరోజు ఉద‌యం హుటాహుటిన ఆయ‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు. శ్రీ‌విష్ణు న‌టిస్తున్న అల్లూరి చిత్రీక‌ర‌ణ పూర్తవుతోంది.