Sports

టోక్యోలో డెల్టా వేరియంట్ కలకలం.. అభిమానులు లేకుండానే పోటీలు

ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ రాజధాని టోక్యోలో కరోనా డెల్టా వేరియంట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ క్రీడా సంబరాన్ని చూడాలని అనుకునే అభిమానులకు జపాన్ ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్ క్రీడలు నిర్వహించనున్నట్టు జపాన్ ఒలింపిక్స్ మంత్రి తమాయో మరుకవా వెల్లడించారు. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు అందుకు అంగీకరించారని తెలిపారు. డెల్టా వేరియంట్ కారణంగా అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం టోక్యోలో ఆగస్టు 22 వరకు అత్యయిక పరిస్థితి అమల్లో ఉంటుందని ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి.

టోక్యోలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు నానాటికీ అధికం అవుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం టోక్యోలో అత్యయిక పరిస్థితిని విధించింది. ఈ ఎమర్జెన్సీ ఆగస్టు 22 వరకు అమల్లో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు టోక్యో నగరం ఎమర్జెన్సీ నీడలో కొనసాగనుంది.టోక్యోలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే రావడంతో, 10 వేల మంది స్థానిక అభిమానులను స్టేడియంలలోకి అనుమతించాలని ఒలింపిక్స్ నిర్వాహకులు భావించారు. డెల్టా వేరియంట్ విజృంభణ కారణంగా అభిమానులు లేకుండానే పోటీలు జరగనున్నాయి.

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత్ తరపున ఎంసి మేరీ కోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జెండా మోయనున్నారు. ఆగస్టు 8 న జరిగే ముగింపు కార్యక్రమంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా జెండా మోయనున్నారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) ఈ విషయాన్ని ఆటల నిర్వాహక కమిటీకి తెలియజేసింది. బాక్సర్ మేరీకోమ్, హాకీ ఆటగాడు మన్ ప్రీత్ సింగ్ మార్చ్ పాస్ట్ లో వీరిద్దరూ భారత త్రివర్ణ పతాకం చేతబూని దేశ క్రీడా బృందానికి ముందు నడవనున్నారు. ముగింపు కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పునియా భారత జెండా మోయనున్నారు. ఒలింపిక్స్ కు వెళుతున్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రోత్సహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − five =

Back to top button