భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలను ముద్రించాలి

0
922

భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటోతో పాటు వినాయకుడి ఫొటోను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరోవైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించవచ్చని చెప్పారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా లేనిది మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కరెన్సీ నోట్లపై మన దేవతల ఫొటోలు ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు. ఈఏడాది కాలుష్యం తగ్గిందని.. కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఇలాగే సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.