More

    బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాన ఎక్కిన మంత్రి.. విమర్శలు రావడంతో ఇలా..!

    కొందరు రాజకీయ నాయకుల తీరు ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సదరు నేతలు తమకు విఐపి ట్రీట్మెంట్ దక్కాలని అనుకుంటూ ఉంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన మంత్రి గారు బూట్లు నీటిలో తడవకుండా ఉండడానికి ఏకంగా మత్స్యకారుల భుజాల మీదకు ఎక్కారు. ఈ వీడియో వైరల్ అయ్యి విమర్శలు రావడంతో తాను చేసింది తప్పే కాదని.. అది వాళ్ళ అభిమానం అంటూ చెప్పుకొచ్చారు.

    తమిళనాడు రాష్ట్రం పాలవర్కడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ సముద్రపు కోతను పరిశీలించేందుకు పర్యటించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం పడవపై ఆయన ప్రయాణించారు. బోటు తీరానికి చేరగా మంత్రి దిగేందుకు మత్స్యకారులు ఒక కూర్చివేశారు. అయితే పడవ ఒడ్డుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో తన కాలి బూట్లు నీటిలో తడుస్తాయని భావించిన అనితా రాధాకృష్ణన్‌ పడవ దిగేందుకు ససేమిరా అన్నారు. దీంతో మత్స్యకారులు ఆయనను తమ చేతులపై మోసి ఒడ్డుకు చేర్చారు.

    తెలుపు రంగు బూట్లు ధరించిన సదరు మంత్రి సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. మత్స్యకారులు ఆయన్ను భుజాలపై మోసుకెళ్ళడం వైరల్ అయ్యింది. మట్టి కోత గురించి స్థానికులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలో పాల్గొన్న మంత్రి, పడవ నుండి మత్స్యకారుల భుజాలపై ఎక్కి పొడి నేల నీడ దిగారు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియా యూజర్లు. ఈ విమర్శలను సదరు మంత్రి ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నారు. తనను అభిమానంతో మత్స్యకారులు మోసారని చెప్పుకొచ్చారు.

    తనకు నీటిలో అడుగు పెట్టడం ఇష్టం లేకనే ఇలా వాళ్ళతో మోయించుకున్నాను అనే విమర్శలను మంత్రి అనితా రాధాకృష్ణన్ ఖండించారు. మత్స్యకారులే తనను ఆప్యాయతతో బయటకు తీసుకెళ్లడానికి ముందుకొచ్చారని చెప్పారు. “నేను వారి భుజాలపై ఎక్కాలని డిమాండ్ చేస్తే అది తప్పు అని.. ఒక మత్స్యశాఖ మంత్రి ఒక మత్స్యకారుడి భుజంపై మాత్రమే ఎక్కగలడు, అతను ఎవరి భుజంపైకి ఎక్కగలడు? ” అంటూ మీడియాకు చెప్పారు మంత్రి అనితా రాధాకృష్ణన్. 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత, తిరుచెందూర్ నియోజకవర్గం నుండి రాధాకృష్ణన్ గెలిచి, మత్స్య, మత్స్య సంక్షేమ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

    Trending Stories

    Related Stories