More

    రాజపాళయం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి గౌతమి

    తమిళనాడులో బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. దీంతో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య గత ఎనిమిది రోజులుగా కొనసాగిన ప్రతిష్ఠంభన సమసిపోయినట్లు అయ్యింది.

    బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తికనబరుస్తున్న నియోజకవర్గాల జాబితాను ఇప్పటికే కమలం నేతలు అన్నాడీఎంకేకు అందజేశారు.విరుదునగర్‌, రాజపాళయం, మదురై ఈస్ట్‌, మదురై నార్త్‌, సేలం, ఆత్తూరు, నామక్కల్‌, రాశిపురం, ఈరోడ్‌, భవానీ, తిరుప్పూరు, కోయంబత్తూర్‌ సౌత్‌, సూలూరు, కరూరు, అరవకురిచ్చి, చేపాక్‌-ట్రిప్లికేన్‌, మైలాపూరు, హార్బర్‌, కొళత్తూరు, చెంగల్పట్టు, ఆలందూరు, కాంచీపురం, శ్రీపెరంబుదూరు, వేలూరు, కేవీకుప్పం, కృష్ణగిరి, హోసూరు, ధర్మపురి, పళని, కారైక్కుడి, తిరువళ్లూరు లేదా తిరుత్తణి నియోజకవర్గాలలో 20 నియోజకవర్గాలను ఖరారు చేయాలని సూచించినట్టు సమాచారం.

    సీట్లతోపాటు పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలు ఖరారు కావడంతో… బీజేపీ అధిష్ఠానం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. రాజపాళయం నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ నటి గౌతమి, అలాగే చేపాక్ –ట్రిప్లికేన్ స్థానం నుంచి ఖుష్బూ పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.ఈ రెండు నియోజకవర్గాల్లో వీరిద్దరు కూడా గత రెండు నెలల ముందు నుంచే తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాన్ని చుట్టేశారు. నామినేషన్ వేసిన తర్వాత మరింత ఉదృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇక తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ రాశిపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మైలాపూర్ లో కేటీ రఘవన్, ఇంకా బీజేవైఎం అధ్యక్షుడు వినోజ్ సెల్వం హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇటు కన్యాకుమారి లోక్ సభ స్థానానికి బీజేపీ…తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ ను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ వసంత్ కుమార్ మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి ఫోన్ రాధాకృష్ణన్…ఈ నియోజకవర్గం నుంచి 1999, 2014లో లోక్ సభకు ఎన్నికయ్యారు.

    మరోవైపు తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగున్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించినందుకు బీజేపీ కార్యకర్తలు అందరూ దిగుచెందాల్సిన అవసరం లేదని.., అంతా కలసికట్టుగా కూటమి విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోసారి అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని మురుగున్ తెలిపారు.

    Trending Stories

    Related Stories