నూపుర్ శర్మను హత్య చేస్తామనే బెదిరింపులు కొనసాగుతూనే ఉంది. ఆమె తల నరికితే భారీగా నజరానా ఇస్తామని ఇస్లాంవాదులు ప్రకటిస్తూనే ఉన్నారు. అలాంటి మరో ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు ఆమె తల తెచ్చిచ్చిన వారికి బహుమానం ప్రకటించారు. జూన్ 2న నూపుర్ శర్మ తలపై టీఎంసీ నేత వసీం రజా రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ ముస్లిం నాయకుడు తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ లో దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు చంపేయాలని చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత అతను తన పోస్ట్ ను ఎడిట్ చేశాడు. నుపుర్ శర్మను అరెస్టు చేయాలని పోస్ట్‌ను సవరించాడు. అతని అసలు పోస్ట్ ను 30 జూన్ 2022న ఎడిట్ చేశాడు. మెసేజ్ ఎడిట్ హిస్టరీలో, అతని అసలు పోస్ట్‌లో అరెస్ట్ గురించి ప్రస్తావన లేదు. బదులుగా, వసీం రజా నూపుర్ శర్మ శిరచ్ఛేదనానికి బహుమానాన్ని స్పష్టంగా ప్రకటించాడు.


భారతీయ జనతా పార్టీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా TMC అగ్రనేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో వసీం రజా కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. వసీం రజా తన ఫేస్‌బుక్ ఖాతాలో టీఎంసీ నాయకుడినని స్పష్టం చేస్తూ పలు ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు.