More

  85 ఏళ్ల మాతృమూర్తిని హత్య చేసిన తృణమూల్ కార్యకర్తలు..!

  “బెంగాల్ పుత్రిక.. ఒకరికి తల్లి.. వేరొకరికి సోదరి అయినవారు నేడు చనిపోయారు.. టీఎంసీ గూండాలు ఆమెను చంపేశారు.. జరిగిన ఈ దారుణ ఘటనపై కనీసం పశ్చాత్తాపం గానీ.. నివాళిగానీ కనబరచని ప్రభుత్వాన్ని ప్రస్తుతం చూస్తున్నాం.. తద్వారా ఆ తల్లి కుటుంబానికి అయినా గాయాన్ని ఎవరు మాపగలరు.. టీఎంసీ పాలిటిక్స్ క్రూరంగా ఉన్నాయనేది స్పష్టం”

  తమ స్వార్ధ రాజకీయాలకోసం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దారుణాతి దారుణానికి ఒడిగట్టారు. భాజపా కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా ఇప్పటికే ఎన్నో దాడులు, మరెన్నో హత్యలు చేసినట్లుగా అభియోగాలు నడుస్తున్న సమయంలోనే.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన మరో క్షమించరాని నేరానికి యావత్ బెంగాల్ మూగబోయిన ప్రజానీకం విస్తుపోయిన పరిస్థితి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

  బీజేపీ కార్యకర్త మాతృమూర్తి.. 85 సంవత్సరాల వృద్ధురాలిపై దాడి చేసిన తృణమూల్ మూక ఆమె మరణానికి కారణమయ్యారు. నార్త్ 24 పరగణాలో నెల క్రితం కొంత మంది వ్యక్తులు మూక దాడి చేసి దారుణంగా ఆ వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలతో పోరాడుతూ గడచిన ఆదివారం ఆమె మరణించారు.

  గోపాల్ మజుందర్, తల్లి షోవా మజుందర్ ఇంట్లో ఉండిఉండగా వీరివురిపై ఎటాక్ చేసారు తృణమూల్ కార్యకర్తలు. తీవ్రగాయాలపాలైన తల్లి షోవా మజుందర్ ఫోటోను షేర్ చేశాడు గోపాల్ మజుందర్. ఆ ఫోటో తర్వాత చాలా వైరల్ అయింది. ఆ ఒక్క ఫోటో చూస్తే చాలు దాడి తీవ్రత అంచనా వేయవచ్చును. తల్లి షోవా మజుందర్ మొహం భాగం మొత్తం తీవ్రంగా వాచిపోయి కనిపిస్తోంది. ఫోటో మీరూ చూడవచ్చు.

  దాడిచేసే ముందు తృణమూల్ కార్యకర్తలు వివరీతంగా ఆ తల్లిని దూషించినట్లుగా తెలుస్తుంది. దాడి అనంతరం ఆమె ముఖచిత్రం బెంగాల్ లో మమతా బెనర్జీ క్రూరమైన రాజకీయాలకు అద్దం పడుతోందనేది అక్కడి ప్రజానీకం మాట.

  భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షులు అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ.. “బెంగాల్ పుత్రిక.. ఒకరికి తల్లి.. వేరొకరికి సోదరి అయినవారు నేడు చనిపోయారు.. టీఎంసీ గూండాలు ఆమెను చంపేశారు.. జరిగిన ఈ దారుణ ఘటనపై కనీసం పశ్చాత్తాపం గానీ.. నివాళిగానీ కనబరచని ప్రభుత్వాన్ని ప్రస్తుతం చూస్తున్నాం.. తద్వారా ఆ తల్లి కుటుంబానికి అయినా గాయాన్ని ఎవరు మాపగలరు.. టీఎంసీ పాలిటిక్స్ క్రూరంగా ఉన్నాయనేది స్పష్టం” అని అర్ధం వచ్చేలా తెలిపారు.

  బీజేపీ నేషనల్ సెక్రటరీ.. వెస్ట్ బెంగాల్ కో ఇంఛార్జ్ అరవింద్ మీనన్.. ట్వీట్ చేస్తూ 85 ఏళ్ల మాతృమూర్తి మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.. ఓంశాంతి అంటూ చెబుతూ.. బెంగాల్ మమతా బెనర్జీ అరాచకాలను క్షమించదు అని వ్రాశారు.

  మొత్తంగా ఈ అంశంపై బెంగాల్ లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. తృణమూల్ గూండాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని బీజేపీ అంటుంటే.. మమ్మల్ని ఓడించేవాడు ఎవడూ లేడనేంతగా.. కాలికున్న కట్టుతోనే మమతా తన రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు. చూద్దాం ఇటువంటి అనేక అంశాల వెల్లడవుతున్న దృష్ట్యా జనం ఎటువైపు మళ్లుతారు అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనున్న అంశం.

  Trending Stories

  Related Stories