శ్రీవారి ఆలయం నుండి ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనం ఇస్తారు. కైశిక ద్వాదశి నాడు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. నేడు కైశిక ద్వాదశి కావడంతో వేకువజామున తిరువీధి ఉత్సవంగా వచ్చారు. అది కూడా సూర్యోదయం ముందే ఆలయం నుండి వెలుపలికి వచ్చి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 4:30 నిముషాలకు ఆలయం నుండి వెలుపలికి ఊరేగింపుగా వచ్చిన స్వామివారు 5:30లకు ఆలయంలోకి చేరుకున్నారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి స్వామి వారిని దర్శించుకున్నారు. మళ్లీ వచ్చే ఏడాది కైశిక ద్వాదశి నాడే ఆలయం వెలుపలికి వస్తారు.