తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

0
693

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రెండవ శనివారం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. సర్వ దర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. భక్తులు చిరుజల్లుల్లోనే తడుస్తూ దర్శనానికి వెళ్లి వస్తున్నారు. తిరుమల కొండను పొగమంచు కమ్మేసింది. శనివారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు దట్టమైన పొగమంచు తిరుమలను చుట్టేసింది. భక్తుల రద్దీతో క్యూలైన్‌లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి ఉద్యాన వనాలలో ఏర్పాటు చేసిన క్యూలైన్‌లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టీటీడీ అధికారులు క్యూలైన్‌లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, అల్పాహారం వంటివి అందచేస్తున్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు:

శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు గర్భాలయ అభిషేకాలు రద్దు చేశారు. అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.