తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ, చెల్లెలు నీనా కొఠారి, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి స్వామివారి సేవలో పాల్గోన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.