More

  టిప్పు సుల్తాన్ హీరోనా..? విలనా..?

  టిప్పు సుల్తాన్ చరిత్ర అంతా కన్ఫ్యూజనే…! కొంతమంది అతన్ని హీరోగా ప్రచారం చేస్తున్నారు..! అంతేకాదు ఒక రచయిత అయితే అతన్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ నవల కూడా రాశాడు..! అంతేనా…, అతను రాసిన The Sword of Tipu Sultan నవల ఆధారంగా ఓ టీవీ సీరియల్ ను కూడా నిర్మించారు. దూరదర్శన్ లో ప్రసారం కూడా చేశారు! అయితే ఈ సీరియల్ నిర్మాణంపై 90వ దశకంలో సుప్రీంకోర్టులో చాలా రోజుల పాటు కేసులు కూడా నడిచాయి..! టిప్పు హీరో కాదు…? విలన్ అంటూ కొంతమంది జాతీయవాద చరిత్రకారులు ఎన్నో ఆధారాలు బయటపెట్టారు..! అయితే ఈ ఆధారాలను ఏమాత్రం పట్టించుకోని…కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో తెరపైకి టిప్పు జయంతి వేడుకలను తీసుకువచ్చింది! కేవలం ముస్లిం ఓట్ల కోసమే టిప్పు జయంతి ఉత్సవాలను నిర్వహించడం మొదలు పెట్టిందని విమర్శలు వచ్చాయి.

  తాజాగా ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొదట టిప్పు జయంతి వేడుకలను రద్దు చేసింది. అలాగే స్కూల్ బుక్స్ లో టిప్పు పాఠ్యాంశాలను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే తాజా టిప్పు వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదలైంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజచేయడంతో వివాదం రాజుకుంది. టిప్పు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి టిప్పు సుల్తాన్ చరిత్రపై సరికొత్త చర్చ మొదలైంది!

  ఇంతకీ టిప్పు సుల్తాన్ హీరోనా? విలనా? ఏది నిజం..?

  నయవంచన, కుట్రలు, కుతంత్రాలు…ఇది టిప్పు సుల్తాన్.., ఆయన తండ్రి హైదర్ ఆలీ జీవితం..! బ్రతుకు దెరువు చూపిన ఇంటికే కన్నం వేసిన ఘనుడు హైదర్ అలీ..! హిందూ రాజుల వద్ద సైన్యాధికారిగా ఉంటూనే కుట్రలతో మొత్తం మైసూర్ రాజ్యాన్నే తన హస్తగతం చేసుకున్నాడు..! అయితే హైదర్ ఆలీ కంటే దుర్మార్గుడు టిప్పు అని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు..! భారత దేశ చరిత్రలో ఔరంగ జేబు తర్వాత హిందువులను అనేక అత్యాచారాలకు గురిచేసినవాడిగా టిప్పు పేరుపోందాడు..!

  అయితే తన చివరిదశలో మాత్రం హిందువులతో సఖ్యతగా ఉంటేనే తన రాజ్య మనుగడ సాధ్యమని గుర్తించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. అందుకే శృంగేరి శంకర పీఠానికి కానుకలు పంపించాడని అంటారు..! ఈ కానుకలు ఇచ్చినంతా మత్రాన టిప్పు సెక్యులర్ రాజు అయిపోతాడా? అంతకు ముందు హిందువులపైనా ఆయన చేసిన దారుణమారణకాండ, అత్యాచారాలు, మతమార్పిడీలు అన్ని మాఫీ అయిపోతాయా? అంటూ హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి..! దీనిపై మాత్రం మన కుహనా సెక్యులర్ నేతలు, సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు, ఇంకా కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, ఇంకా లెఫ్ట్ లిబరల్ చరిత్రకారులు నోరువిప్పరు! పైగా ప్రజలను తమదైన అసత్యకథనాలతో తప్పుదొవపట్టించే ప్రయత్నం చేశారు..!

  అది 1747 సంవత్సరం..! ఇరాన్ పాలకుడు..మహా క్రూరుడైనా నాదిర్షా మరణించాడు. అతని ముఖ్య సైన్యాధికారుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ తనను తాను అఫ్గనిస్థాన్ కు పాలకుడుగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్ ఆక్రమించి పెషావర్ మీదుగా ఆనాటి భారత భూభాగాలైన లాహార్, సర్ హింద్ ప్రాంతాలపై ఆక్రమించాడు. అదేపనిగా 1749, 1752, 1755, 1761 వరుసగా ఉత్తర భారతంపై దండయాత్రలు చేశాడు. చివరకు మొగల్ రాజు రెండో షాలం కూడా భయపడి చేతులు ఎత్తేశాడు. విదేశీ దురాక్రమణదారుడైన అబ్దాలీని ఎదుర్కొనేందుకు దక్షిణ భారతంలో శక్తివంతులైన వీరులుగా పేరుపొందిన హిందువులైనా మరాఠాలను ఆశ్రయించాడు షా ఆలం. ఈ యుద్ధంలో విజయానికి చేరువైనా మరాఠా సైన్యం..కొన్ని స్వీయ తప్పిదాల కారణంగా చివరకు ఓటమి చవి చూసిందని చరిత్రకారులు చెబుతారు.

  ఇటు అదే సమయంలో దక్షిణ భారతంలో మరాఠా హిందూ సైనిక శక్తికి భయపడి అనేక మంది ముస్లిం సైన్యాధికారులు కుక్కిన పేనుల్లా పడివున్నారు. 1761లో మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడంతో…ఈ ముస్లిం సైన్యాధికారులు అందరూ తమ కుట్రలను అమలు చేయడం మొదలు పెట్టారు. అలా కుట్రలు మొదలు పెట్టి… మైసూర్ హిందూ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు హైదర్ ఆలీ..! మోసగాడైన హైదర్ ఆలీ టిప్పునకు తండ్రి..!

  ఈ హైదర్ ఆలీ పూర్వీకులు భారతీయులు కాదు..! బ్రతుకు దెరువు కోసం మన దేశానికి వలస వచ్చినవారే..! అంతేకాదు వీరి పూర్వీకుల గురించి కూడా అనేక వాదనలు ఉన్నాయి. హైదర్ ఆలీ తాత పర్షియా నుంచి భారత్ కు వలస వచ్చాడని అంటారు. మరికొంతమంది ఇతని పూర్వీకులు ఇప్పటి అఫ్గనిస్థాన్ ప్రాంతానికి చెందినవారిగా పేర్కొంటారు. మరోక ఆధారం ప్రకారం హైదర్ ఆలీ తనను తాను స్వయంగా అరబ్ ఖురేషీ తెగకు చెందినవాడిగా పేర్కొన్నాడని చెబుతుంటారు. ఎటుచూసిన కూడా టిప్పు పూర్వీకులు ఈ భారత భూమి వాసులు కారన్నది నిజం..!

  అంతేకాదు హైదర్ ఆలీకి మరో పేరు హైదర్ నాయక్..! హైదర్ తండ్రి ఫతే మహమ్మద్… మైసూర్ హిందూ రాజులు సైన్యంలో పనిచేశాడు. ఆయన సేవకు గుర్తుగా వొడయార్ రాజులు…బుధికోటను జాగీరును ప్రదానం చేశారు. అక్కడే అతను నాయక్ పనిచేశాడు. హైదర్ ఆలీ ఈ కోటలోనే జన్మించాడు. సోదరుడు షాబాజ్ తో కలిసి హైదర్ మైసూర్ సైన్యంలో పనిచేశాడు. ఇక్కడే కుట్రలు చేసి వొడయారు రాజులను మోసం చేసి వారి రాజ్యాన్ని ఆక్రమించుకుని తనకు తాను మైసూర్ సుల్తాన్ గా ప్రకటించుకున్నాడు.

  1750 నవంబర్ లో హైదర్ ఆలీ రెండో భార్య ఫక్రున్నీసా బేగంకు…, టిప్పు జన్మించాడు. అయితే కొంతమంది టిప్పు నవంబర్ 10వ తేదీన జన్మించాడని, మరి కొంతమంది 20వ తేదీన జన్మించాడని అంటారు. వ్యాపారం పేరుతో మన దేశంలో తిష్టవేసిన ఫ్రెంచ్ వారితో స్నేహం కట్టాడు. హైదర్ ఆలీ కూడా ఫ్రెంచ్ వారితో సఖ్యతగా మెలిగాడు. 1782లో బ్రిటీష్ వారితో జరిగిన రెండో మైసూర్ యుద్దంలో తన తండ్రితో కలిసి టిప్పు పాల్గొన్నాడు.ఈ యుద్ధంలో బ్రిటీష్ వారిపై హైదర్ ఆలీ పైచేయి సాధించాడు. ఆ తర్వాత కొంతకాలానికే హైదర్ అలీ మరణించాడు. తండ్రి మరణం తర్వాత మైసూర్ సంస్థానానికి టిప్పు…సుల్తాన్ అయ్యాడు..!

  అధికారంలోకి రాగానే తన మైసూర్ రాజ్యానికి మూలపురుషుడైన వడియారు రాజు పేరును తొలగించాడు. దక్షిణ భారతాన్ని మొత్తం ఇస్లామ్ మయంగా చేయాలని కలలు కన్నాడు. ముఖ్యంగా ఆనాటి దక్షిణ భారతంలోని కేరళ ట్రావెన్‌ కోర్‌ సంస్థానంపై కన్నేశాడు..! ట్రావెన్ కోర్ సంస్థానం సుసంపన్నమైనది..! నిండు కొలువులో తన రాజ్యంలోని కాఫిర్ లు అందరూ ముస్లింలుగా మారిపోవాలని హుకుం జారీచేశాడు. ఆరోజుల్లో ముస్లింలు అందరూ హిందువులను కాఫిర్లుగా పిలచేవారు. టిప్పు ఆదేశంతో సైనికులు రెచ్చిపోయారు. కనిపించిన హిందూ కుటుంబాలను నరకయాతనలకు గురిచేశారు.

  లూయిస్ రైస్ అనే బ్రిటీష్ చరిత్రకారుడు హిస్టరీ ఆఫ్ మైసూర్ అండ్ కూర్గ్ అనే పుస్తకంలో తన రాజ్యంలో టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడమేకాకుండా, అనేక మందిని ఎలా ముస్లింలుగా మార్చింది వివరించాడు. దాంతో చాలా మంది హిందువులు తమ ధర్మాన్ని, మానాన్ని కాడుకునేందుకు మైసూర్ రాజ్యాన్ని వదిలి…ఇతర ప్రాంతాలకు వలసపోయారు.

  Trending Stories

  Related Stories