ఇరాక్ కు చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్, మావెరిక్ పబ్లిక్ ఫిగర్ అయిన ఎమాన్ సమీ మగ్డిద్‌ను ఆమె సొంత సోదరుడు కాల్చి చంపాడు. ఇది పరువు హత్యగా నివేదించబడింది. క్రాప్ టాప్స్ ధరించి, ఆ చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసినందుకు మగ్దిద్ హత్య చేయబడింది.
మెట్రోలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 20 ఏళ్ల మాగ్దిద్ ను గత వారం ఎర్బిల్ నగరంలోని ఒక రహదారిపై ఆమె 17 ఏళ్ల సోదరుడు కాల్చి చంపాడు. తన సోదరిపై ఎనిమిది నుండి తొమ్మిది బుల్లెట్లను అతడు కాల్చాడు. ఆమెకు 47,000 మంది టిక్‌టాక్ ఫాలోవర్లు ఉన్నారు. పలు వీడియోలలో ఆమె క్రాప్ టాప్‌లు ధరించి ఫోటోలను అప్లోడ్ చేసేది, సిగరెట్‌లు తాగడం, బోల్డ్ గా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వంటివి చేసింది. ఇరాకీ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఆమె చర్యలు ఉన్నాయి. ఆమె ఇప్పటికీ ముస్లిం అని, క్రైస్తవ మతంలోకి మారలేదని, ఆమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మాత్రమే పలు వస్తువులను ధరించిందని చెప్పేవారు.
ఇస్లామిక్ స్టేట్, ఇతర తీవ్రవాద సంస్థల పెరుగుదల కారణంగా ఆయా ప్రాంతాల్లో మహిళలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. మహిళలను లైంగిక వాంఛకు సంబంధించిన వస్తువులుగా పరిగణించబడుతున్నారు. స్త్రీలు తమ శరీరాలను పూర్తిగా కప్పుకోవడం, మగ తోడు లేకుండా తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లకూడదనే నిబంధనలను విధిస్తూ ఉంటారు.
ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే సంప్రదాయ నిబంధనలను అతడి సోదరి ధిక్కరించడం, బదులుగా క్రాప్ టాప్స్ ధరించడాన్ని ఎంచుకోవడం పట్ల మగ్దిద్ సోదరుడు అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. తన సోదరి ఇస్లామిక్ సంప్రదాయాలను ఉల్లంఘించిందనే ఈ భావనే తన సోదరిని తన సోదరిని చంపడానికి ప్రేరేపించిందని నివేదికలు సూచించాయి.
ఈ సంవత్సరం ఇరాక్‌లో జరిగిన పరువు హత్యకు మగ్డిద్ మాత్రమే బాధితురాలు కాదని గమనించాలి. కేవలం 2 నెలల్లో, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో 10 మందికి పైగా మహిళలు మరణించారు. 23 ఏళ్ల లింగమార్పిడి చేయించుకున్న మహిళ డోస్కీ ఆజాద్ ను ఆమె సోదరుడే కాల్చి చంపారు.