International

టిక్ టాక్ కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్

చైనీస్ యాప్ టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు సార్లు బ్యాన్ చేసినా.. ఈ యాప్ తీరులో మార్పు రాలేదని పాకిస్తాన్ చెబుతోంది. టిక్‌టాక్‌కు మూడుసార్లు యాక్సెస్‌ను బ్లాక్ చేసిన తరువాత కూడా పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పిటిఎ) మరోసారి ఈ ప్లాట్‌ఫాంపై నిషేధాన్ని విధించింది. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పిటిఎ) బుధవారం ఈ ఉత్తర్వును విడుదల చేసింది, “ఎలక్ట్రానిక్ నేరాల నివారణ చట్టం 2016 యొక్క నిబంధనల దృష్ట్యా, దేశంలో టిక్‌టాక్ యాప్ ను, వెబ్‌సైట్‌లోకి ప్రవేశాన్ని పిటిఎ నిరోధించింది.” అంటూ ట్వీట్ చేసింది. ” టిక్ టాక్ ప్లాట్‌ఫామ్‌లో అనుచితమైన, అశ్లీలమైన కంటెంట్ నిరంతరం ఉండటం. అలాంటి కంటెంట్‌ను తీసివేయడంలో యాప్ యాజమాన్యం వైఫల్యమవుతున్న కారణంగా ఈ చర్య తీసుకోబడింది.” అని పిటిఎ తెలిపింది.

Pakistan bans TikTok, again, for the fourth time

గత పది నెలల్లో పాకిస్తాన్ ప్రభుత్వం టిక్ టాక్ పై నిషేధాన్ని అమలు చేయడం ఇది నాల్గవసారి, అయితే సంస్థ నుండి హామీ పొందడంపై ప్రతిసారీ దాన్ని తక్షణమే ఎత్తివేసింది. తాజాగా ఈ వార్తలను చూసిన నెటిజన్లు ప్రభుత్వం తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉన్నారు. ఈ ఆన్-ఆఫ్ ప్రక్రియను పాక్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు కొనసాగిస్తుందో అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. యాప్ విషయంలో కోసం పాకిస్తాన్ నిర్దిష్ట నియమాలను కలిగి ఉండాలని, నియమాలను పాటించని వారిని శిక్షించాలని ఒక వినియోగదారుడు టిక్ టాక్ కు సలహా ఇచ్చారు.

సస్పెన్షన్ల చరిత్ర:

‘అసభ్యకరమైన మరియు ‘అనైతిక ’కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులపై 2020 అక్టోబర్‌లో టిక్ టాక్ ను పాక్ లో తొలిసారిగా నిషేధించారు. అశ్లీలతను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చిన పది రోజుల తరువాత, నిషేధం ఎత్తివేయబడింది. ఆ తర్వాత పెషావర్ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో వీడియో-ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాంపై నిషేధం విధించింది. దీనిని ఏప్రిల్‌లో ఎత్తివేసింది. సింధ్ హైకోర్టు జూన్‌లో చివరి నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం కూడా కేవలం మూడు రోజులు మాత్రమే కొనసాగింది. ఈ యాప్ లో ఆయుధాలకు సంబంధించిన వీడియోలు, డ్రగ్స్‌ను ప్రోత్సహించడం వంటి వీడియోలు ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తాజా సస్పెన్షన్ ఎంతకాలం ఉంటుందో చూద్దామని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fifteen − six =

Back to top button