More

    ఆ జిల్లాల్లో టెన్షన్ పెడుతున్న పులులు

    ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులను పులులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలి నెలల్లో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల అడవుల్లో పులుల సంచారం నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని టైగర్ జోన్‌లోనూ.. పెద్దంపేట, ధర్మారం, కొత్తూరు ప్రాంతాల్లో పులులు కనిపించాయి. పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం పులి కనిపించింది. 45 రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాల వాసులు పలిమెల మండలం తమ్మేటిగూడెం సమీపంలోని పొలాల్లో సగం తినేసి ఆవు కళేబరాన్ని గుర్తించారు.

    చంద్రపూర్ జిల్లాలో ఓ పెద్దపులి దాడిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి చెందారు. ముల్ తాలుకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్ , దివరూ పసలేకర్ అనే ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అటు కొమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వేంపల్లి అటవి ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒకే రోజు మూడు వేరు వేరు చోట్ల పులి దాడి చేయడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నాచారం మండలం జమ్మల బండలో గత వారం రోజులుగా పులుల సంచారం కనిపించింది. రెండు వారాల క్రితం మల్హర్ మండలం మల్లారం గ్రామ శివారులోని పెద్ద గుట్టల సమీపంలో రోడ్డు దాటుతున్న పులిని గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మానేర్‌ నదిని దాటి యడ్లపల్లి అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లడాన్ని గ్రామస్థులు గమనించారు.

    Trending Stories

    Related Stories