ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో బ్రాహ్మణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, భర్తతో సహా 8 సంవత్సరాల కుమార్తె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఓ జంట.. వారి ఎనిమిదేళ్ల కుమార్తె బుధవారం నాడు వారి ఇంటిలో శవమై కనిపించారు. ఇది ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. “సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస్ వికాస్ కాలనీలో 35 ఏళ్ల వ్యక్తి, అతని 30 ఏళ్ల భార్య మరియు కుమార్తె (8) మృతదేహాలు వారి ఇంటి గదిలో వేలాడుతూ కనిపించాయి” అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( SSP), ఆగ్రా, ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఇంటి నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన గురించి పొరుగువారికి, బంధువులకు సమాచారం అందించిన దంపతుల 10 ఏళ్ల కుమారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ప్రకారం వ్యక్తికి ఉద్యోగం పోవడం.. కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆవాస్ వికాస్ కాలనీలోని సెక్టార్ 10లోని ఓ ఇంట్లో సోను శర్మ (30), అతని భార్య గీత (28), వారి ఎనిమిదేళ్ల కుమార్తె, కుమారుడు ఈడబ్ల్యూఎస్ కాలనీలోని 1046 నెంబరు ఇంటిలో నివసిస్తూ ఉండేవారు. మంగళవారం రాత్రి వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తూ ఉన్నారు.