ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురిని జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరిలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన ముగ్గురిని కుప్వారాకు చెందిన షరాఫత్, కోలాబ్‌కు చెందిన సాజద్ అహ్మాద్ షా, బారాముల్లాకు చెందిన షాహీద్ అహ్మాద్ రతేర్‌గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రెండు పిస్టళ్లు, రెండు మ్యాగజైన్లు, 10 రౌండ్లు, రూ. 3 లక్షల నగదు, 5 చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 53 బెటాలియన్, స్టడీస్ అండ్ అబ్జర్వేషన్స్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముగ్గురు పట్టుబడినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.ఉరి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
వీరి నుండి కీలక సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ లో భద్రతా దళాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.