More

  అస్సాంలోనూ దూసుకుపోతున్న బుల్డోజర్

  అస్సాం లో కూడా బుల్డోజర్ కొందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. విద్యా సంస్థల మాటున తీవ్రవాదులకు చెంచాగిరి చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాంలోని బొంగైగావ్ జిల్లాలో, ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS), అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలున్న మదర్సాను స్థానిక అధికారులు కూల్చివేశారు. బొంగైగావ్‌లోని కబైటరీ గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు.

  ANI నివేదిక ప్రకారం.. SP స్వప్ననీల్ దేకా మాట్లాడుతూ “మదర్సా భవనాలు APWD స్పెసిఫికేషన్స్/IS నిబంధనల ప్రకారం నిర్మించలేదు, మానవ నివాసానికి సురక్షితం కాదని జిల్లా పరిపాలన యంత్రాంగం ఒక ఆర్డర్‌లో పేర్కొంది.” అని చెప్పుకొచ్చారు. అస్సాంలో AQIS/ABTతో సంబంధాలపై అరెస్టయిన ఇమామ్‌లు, మదర్సా టీచర్లతో సహా 37 మంది వ్యక్తులకు సంబంధించి కీలకమైన సమాచారం అధికారులకు అందింది. దర్యాప్తు చేసేందుకు ఆగస్టు 30న అదే మదర్సాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఎస్పీ దేకా తెలిపారు. ఇక మదర్సాను కూల్చివేయాలని జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయని ధృవీకరించారు.

  ఆగస్ట్ 29, సోమవారం, అస్సాంలోని బార్‌పేట జిల్లాలో జిల్లా యంత్రాంగం, పోలీసులు కలిసి బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (AQIS), అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) తో సంబంధాలు ఉన్న చేసిన మౌల్వీ అక్బర్ అలీ, అతని సోదరుడు అబుల్ కలాం ఆజాద్ నిర్వహిస్తున్న మదర్సాను కూల్చివేశారు.

  షేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా ఇస్లామిక్ అకాడమీ పేరుతో ఉన్న మదర్సాపై కూడా చర్యలు తీసుకున్నారు. అస్సాంలోని బార్‌పేట జిల్లాలోని ధకలియాపరా వద్ద ఉంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని నిర్ధారించారు. మదర్సా ప్రిన్సిపాల్ మహమునూర్ రషీద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చిలో అస్సాం పోలీసులు అరెస్టు చేసిన బంగ్లాదేశ్ ఉగ్రవాది ఎండీ సుమన్ అలియాస్ సైఫుల్ ఇస్లాంను షైఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా ఇస్లామిక్ అకాడమీ అనే మదర్సాలో ఉంచారు. ఎండీ సుమన్ తన సహాయకుల్లో ఒకరితో కలిసి ఇక్కడే ఉన్నారని తేలింది. అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు.

  Trending Stories

  Related Stories