More

    3వ తరగతి చదువుతున్న విద్యార్థికి గుండె పోటు ఏంటండీ..?

    ఎప్పుడు ఎవరి ప్రాణాలు.. ఎలా పోతాయో ఎవరూ ఊహించలేము. కానీ 8 సంవత్సరాల పిల్లలకు గుండెపోటు వస్తుందని ఊహించగలమా..? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో అలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. 8 సంవత్సరాల విద్యార్థి గుండెపోటుకు గురై మరణించడం సంచలనం కల్గిస్తోంది.

    బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి గుండె పోటుతో మృతి చెందడం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న భోజనం అందివ్వాల్సి ఉన్నప్పటికీ సూర్య గ్రహణం కారణంగా పదకొండు గంటలకు అందించారు. మధ్యాహ్న భోజనం కోసం క్యూ లైన్లో విద్యార్థులు నిలబడగా మూడో తరగతి చదువుతున్న బుర్ర కౌశిక్ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. కౌశిక్‌ను వెంటనే స్థానిక ఆర్ఎంపీని పిలిపించి చెకప్ చేయించారు. అనంతరం కరీంనగర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే కౌశిక్ మరణించాడని, హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు.

    మధ్యాహ్న భోజనం కోసం క్యూ లైన్లో విద్యార్థులు నిలబడగా మూడో తరగతి చదువుతున్న కౌశిక్ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. కౌశిక్ ను వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికేమరణించాడని, గుండె పోటు కారణంగా చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో పాఠశాలలోనూ, పిల్లాడి గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

    Trending Stories

    Related Stories