మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి..!

0
1002

మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ.. గోడ దూకి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు గాయాలతో ఉన్న పరిస్థితిని చూసిన సెక్యూరిటీ బృందం ఆసుపత్రికి తరలించింది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లోని మహేశ్ బాబు ఇంటి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేయాలని భావించిన ఓ దొంగ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు గోడ ఎక్కి కిందికి దూకాడు. అది చాలా ఎత్తుగా ఉండడంతో కిందపడిన దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద శబ్దం రావడంతో కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి గాయాలతో పడి ఉండడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు తెలుసుకున్నారు. 30 అడుగుల ఎత్తైన గోడ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.