మీరు ఇప్పటి వరకూ ఎన్నో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి వీడియోను బహుశా చూడకపోయి ఉండొచ్చు. కొన్ని ఘటనలను ఊహించలేం.. రెప్పపాటులో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అంచనా వేయలేం. వాటిని తీరికగా.. తీక్షణంగా.. స్లో మోషన్‌లో చూస్తే ఫరవాలేదు.. అలాంటి ఘటన ఒకటి బీహర్‌లో జరిగింది.
ఓ యువకుడు స్నేహితుడితో కలిసి రైలు డోర్ వద్ద కూర్చొన్నారు. రెప్పపాటులో అతని ఫోన్ మాయం అయిపోయింది. తన ఫోన్ లేదని తెలుసుకునేందుకు యువకుడికి సమయం పట్టింది. తర్వాత బిత్తరచూపులు చూశాడు. పైకి లేచి తన ఫోన్ పోయిందని ఒకింత ఆందోళనతో చెప్పాడు. ఆ వీడియోను మరోసారి చూస్తే కానీ దొంగతనం జరిగిందని తెలియలేదు. స్లో మోషన్‌లో చూస్తేనే తీసుకున్నట్టు కనిపిస్తోంది.
రైలు గంగానదీని దాటుతుంది. రైల్వే బ్రిడ్జీ మధ్య ఒకతను వచ్చాడు. ఇద్దరు కలిసి రైలు డోర్ వద్ద ఉన్నారు. ఒకతను ఫోన్ చూడగా.. మరొకరు పక్కన కూర్చొన్నాడు. ఇంతలో రైల్వే బ్రిడ్జీ మీద నిల్చొని.. ఒకడు ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసేది పట్టుకున్న వ్యక్తికి కూడా తెలియదు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది నెటిజన్లు.. అతను ఏమైనా స్పైడర్ మ్యానా అని అంటున్నారు.
ఆ వీడియో తొలుత చూస్తే కనిపించలేదు. స్లో మోషన్‌లో చూస్తే కనిపిస్తోంది. రెప్పపాటులోనే ఫోన్ తీసుకెళ్లాడు. పాట్నా కథియార్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో.. బెగుసరాయి వద్ద ఘటన జరిగింది. రాజేంద్ర సేతు వద్ద వారం కింద జరిగిందని దైనిక్ భాస్కర్ రిపోర్ట్ చేసింది. కానీ వీడియో వైరల్ అవడంతో.. వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఘటన గురించి పోలీసులు స్పందించారు. ఇలాంటి నేరం చేసేవారిని పట్టుకున్నామని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. సదరు దొంగను పట్టుకుంటామని భరోసాను ఇచ్చారు. కానీ ఆ థీప్ మాత్రం మాములుగా లేడు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు. స్పైడర్ మ్యాన్ అంటూ కీర్తించారు.