More

    సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం

    సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేయబోదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం ఏటా.. 26వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని.. మోదీ ప్రధాని అయ్యాక వరి, పత్తి మద్దతు ధరను పెంచారని తెలిపారు. 6వేల, 338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

    సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని.. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

    Trending Stories

    Related Stories